ఏపీ మాజీ మంత్రి అనగానే ఎవరు అని అనుకుంటున్నారా? ఇంకెవరు అనీల్ కుమార్ యాదవ్. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఫైర్ బ్రాండ్ అనే చెప్పుకోవాలి. ప్రతిపక్షాల మీద తనదైన శైలిలో రెచ్చిపోయేవారు. కానీ.. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయన మంత్రి పదవి పోయి కేవలం ఎమ్మెల్యేగానే మిగిలిపోవాల్సి వచ్చింది. సరే.. అదంతా పక్కన పెడితే అనీల్ కుమార్ యాదవ్ మంత్రి పదవే కాదు.. రూ.100 కోట్ల ఆస్తి కూడా పోయిందట. వంద కోట్ల ఆస్తి పోయినా కూడా ఇంకా అప్పులే మిగిలాయట. ఈ వివరాలన్నీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకొచ్చారు మాజీ మంత్రి.
అసలు ముచ్చట ఏంటంటే.. నెల్లూరులో ప్రస్తుతం టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర సాగుతోంది కదా. ఈ పాదయాత్రలో నారా లోకేష్.. అనీల్ కుమార్ యాదవ్ మీద తెగ విమర్శలు చేస్తున్నారు. మామూలుగా కాదు.. మూడేళ్లు మంత్రి పదవిలో ఉండి.. వెయ్యి కోట్లు వెనకేసుకున్నాడు అంటూ ఇష్టం ఉన్నట్టుగా ఆరోపణలు చేశారు నారా లోకేష్. దీంతో అనీల్ కుమార్ కు కోపం వచ్చినట్టుంది వెంటనే ప్రెస్ మీట్ పెట్టేశారు.
నేను మంత్రి అయ్యాక రూ.2.25 కోట్ల వాల్యూ ఉన్న నా సొంత భూమినే అమ్ముకున్నా. ఇస్కాన్ సిటీలో 18 ఎకరాలు ఉండేది. అది ఇప్పుడు 3.98 ఎకరాలు అయింది. నా భార్యకు హైదరాబాద్ లో పసుపు కుంకుమ కింద వచ్చిన 8 సెంట్ల స్థలం తప్పితే నాకు ఇంకేమీ లేదని అనీల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే.. 2.25 కోట్ల రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న ఆ సైట్ విలువ రూ.100 కోట్లు అట. దాన్ని అనీల్ కుమార్ యాదవ్ ఎందుకు అమ్మేసుకున్నారు పాపం అంటూ ఏపీ ప్రజలు తెగ జాలి చూపిస్తున్నారు. ప్రస్తుతం అనీల్ ప్రెస్ మీట్ పైనే ఏపీలో జోరుగా చర్చ నడుస్తోంది.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.