Samantha : వాటికి సమంతకు టైం ఉంది కానీ!.. నాగ చైతన్య విషయంలో మాత్రం అలా
Samantha : సమంత ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తోంది. మాజీ భర్త, నాలుగైదు చిత్రాలు కలిసి పని చేశారు. సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది కూడా చైతూ సినిమాతోనే. అయితే సమంత నాగ చైతన్య ఇప్పుడు విడిపోయారు. వివాహా బంధాన్ని తెంచుకున్నా కూడా స్నేహ బంధాన్ని కొనసాగిస్తామని అన్నారు. కానీ అది మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. సమంత మాత్రం నాగ చైతన్య పూచిక పుల్లలా చూస్తోంది.
నాగ చైతన్య బర్త్ డే అయితే మాత్రం సమంతకు గుర్తు లేదు. నాగ చైతన్య బర్త్ డే సందర్బంగా సమంత ఏదైనా పోస్ట్ వేస్తుందా? అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూశారు. కానీ సమంత నుంచి నో రియాక్షన్. అయితే ఆ తెల్లారే తన కుక్క హష్ బర్త్ డేను సమంత గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. ఇక ఆ తరువాత వెంటనే రాశీ ఖన్నా బర్త్ డే వచ్చింది. ఆమెకు స్పెషల్‌గా విషెస్ చెప్పింది.

Samantha On Lavanya Tripathi And Trisha
Samantha : నాగ చైతన్యను పట్టించుకోని సమంత..
మొన్న రానా బర్త్ డేకు ట్వీట్ వేసింది. ఇక నిన్న లావణ్య త్రిపాఠి బర్త్ డేకు ప్రత్యేకంగా విషెస్ అందించింది. త్రిష ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు అవుతున్న సందర్భంగా కూడా సమంత స్పందించింది. ఇలా అందరి గురించి చెప్పేందుకు సమంతకు టైం ఉంది. కానీ నాగ చైతన్య బర్త్ డే, నాగ చైతన్య సినిమా అప్డేట్లు వస్తుంటే మాత్రం సమంత ఎలాంటి రియాక్షన్లు ఇవ్వడం లేదు.