Samantha : ఎన్టీఆర్‌ని కూడా స‌మంత అంత తేలిగ్గా తీసి ప‌డేసిందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : ఎన్టీఆర్‌ని కూడా స‌మంత అంత తేలిగ్గా తీసి ప‌డేసిందా?

 Authored By sandeep | The Telugu News | Updated on :8 August 2022,5:20 pm

Samantha: అందాల ముద్దుగుమ్మ స‌మంత దూకుడు మాములుగా లేదు. పెళ్లి అయి విడాకుల త‌ర్వాత కూడా స‌మంత రెచ్చిపోయి సినిమాలు చేస్తుంది. ఇక సోష‌ల్ మీడియా ద్వారా ఈ ముద్దుగుమ్మ చేస్తున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఏదో ఒక‌లా త‌న అభిమానుల‌ని అల‌రిస్తూనే ఉంది స‌మంత‌. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో అక్కడ బాగా పాపులారిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ సమంత వరుసగా రెండు మూడు హిందీ సినిమాలతో పాటు ఒక ఇంగ్లీష్ సినిమాను కూడా కమిట్ అయ్యింది. ఇదే సమయంలో ఒక తమిళ సినిమా ను మరియు తెలుగు లో ఖుషి సినిమాను కూడా ఈమె చేస్తుంది. తెలుగు లో ఈమె నటించిన శాకుంతలం మరియు యశోద సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

Samantha : స‌మంత బిజీ షెడ్యూల్..

స‌మంత‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్కిన‌ట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ 30 లో సమంత ను నటింపజేయాలని కొరటాల శివ భావిస్తున్నాడు. గతంలో వీరి ముగ్గురు కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది. జనతా గ్యారేజ్ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న నేపథ్యంలో సెంటిమెంట్ గా కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతో సమంతను హీరోయిన్ గా ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. కాని చివ‌రి మూమెంట్‌లో నో చెప్పింద‌ట‌. ఎన్టీఆర్ తో మరోసారి నటించే అవకాశం రావడం లక్. కానీ దానికి డేట్ లు అడ్ఙస్ట్ కాకపోవడం బ్యాడ్ లక్.

Samantha Rejected Jr NTR Movie

Samantha Rejected Jr NTR Movie

సమంత ఇప్పటికే ఫ్యామిలీమన్ వెబ్ సిరీస్ తీసే బోస్ అండ్ డికే లకు ఓ ప్రాజెక్టు కమిట్ అయ్యారు. దాన్ని పక్కన పెట్టడానికి లేదు. అలాగే మరో హిందీ సినిమా కూడా కమిట్ అయ్యారు. దాన్ని పక్కన పెట్టడానికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ సినిమా ఆఫర్ వచ్చింది. నిజానికి ఇది మంచి అవకాశం. చాలా కాలం తరువాత ఇలా ఓ టాప్ హీరో పక్కన హీరోయిన్ చాన్స్ రావడం అంటే చాలా లక్కీనే. దాన్ని ఎలా వర్కవుట్ చేయాలో అన్నది ప్రస్తుతం సమంత ఆలోచిస్తోంది. మ‌రి సమంత ప్లాన్స్ వ‌ర్క‌వుట్ అయితే ఓకే లేదంటే, ఈ సినిమాకి నో చెప్ప‌క త‌ప్ప‌దు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది