Samantha : నాగచైతన్య ఫ్యాన్స్ హ‌ర్ట్ అయ్యేలా స‌మంత హాట్ కామెంట్స్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : నాగచైతన్య ఫ్యాన్స్ హ‌ర్ట్ అయ్యేలా స‌మంత హాట్ కామెంట్స్‌..!

Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత.. ఇటీవలే విడిపోయారు. కారణాలేంటో ఇప్పటికి స్పష్టంగా తెలియడం లేదు కానీ.. నాలుగేండ్లు వీరి వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక ఇందుకు కారణం సమంతనే అంటూ చాలా మంది ఆమెను ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఆమె మనసు నొచ్చుకునేలా కామెంట్స్ చేశారు. కానీ ఆమె వాటిని పట్టించుకోకుండా పాజిటివ్ యాట్యిట్యూడ్ తో ముందుకు సాగుతోంది. తన దృష్టిని సినీ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :6 December 2021,1:40 pm

Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత.. ఇటీవలే విడిపోయారు. కారణాలేంటో ఇప్పటికి స్పష్టంగా తెలియడం లేదు కానీ.. నాలుగేండ్లు వీరి వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక ఇందుకు కారణం సమంతనే అంటూ చాలా మంది ఆమెను ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఆమె మనసు నొచ్చుకునేలా కామెంట్స్ చేశారు. కానీ ఆమె వాటిని పట్టించుకోకుండా పాజిటివ్ యాట్యిట్యూడ్ తో ముందుకు సాగుతోంది. తన దృష్టిని సినీ కెరీర్ పైకి మళ్లించి అద్భుతమైన ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. ఇటీవలే హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు అనౌన్స్ చేసింది.

సమంత తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన విడాకుల విషయం, వచ్చిన ట్రోల్స్‌పై రియాక్ట్ అయింది. నా మాటలతో అందరూ ముందుగా అంగీకరిస్తారని అనుకోవట్లదని చెప్పుకొచ్చింది సామ్. షరతుల అంగీకారాన్ని నేను డిమాండ్ చేయను. విభిన్నంగా అభిప్రాయాలను కలిగి ఉండాలని ఎవరికీ చెప్పను. కానీ మనం ఇప్పటికీ ఒకరిని ఒకరు ప్రేమించుకోవచ్చు. కరుణించుకోవచ్చు.. నిరుత్సాహాన్ని నాగరికంగా వ్యక్తం చేయాలని కోరుతున్నాను అని చెప్పుకొచ్చింది సామ్. అయితే వాస్తవానికి చై, సామ్ విడాకుల విషయంలో ట్రోల్స్ చేసిన వారంతా దాదాపు సమంతనే దోషిగా చూశారని చెప్పాలి. ట్రోల్స్ సైతం హద్దులు దాటాయినే చెప్పొచ్చు.

samantha responds to trollse

samantha responds to trollse

Samantha : నాగరికంగా వ్యక్తం చేయండి

ఇదిలా ఉండగా సమంత మాత్రం ప్రస్తుతం పెద్ద పెద్ద ప్రాజెక్టులకు సైన్ చేస్తోంది. చేతి నిండా మూవీస్ తో ఫుల్ బిజీ అవుతోంది. ప్రస్తుతం శాకుంతలం మూవీలో ఆమె యాక్ట్ చేస్తోంది. ఇది లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్. ఈ మూవీ దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్నది. వచ్చే సంవత్సరంలో రిలీజ్ చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తోంది. బాలీవుడ్‌లో రెండు మూవీస్ లో సామ్ యాక్ట్ చేయనుంది. ఇందులో ఓ మూవీ హీరోయిన్ తాప్సీ సొంత బ్యానర్ లో రాబోతోంది. ఇది సైతం లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ అని టాక్.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది