Samantha : ప్రెగ్నెంట్ అయిన సమంత!.. వామ్మో అదరగొట్టేసిందిగా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : ప్రెగ్నెంట్ అయిన సమంత!.. వామ్మో అదరగొట్టేసిందిగా

 Authored By aruna | The Telugu News | Updated on :9 September 2022,2:30 pm

Samantha : సమంత గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తోన్న సంగతి తెలిసిందే. సమంతకు ఏమైంది? ఎందుకిలా సైలెంట్ అయిపోయిందంటూ రకరకాలుగా జనాలు అనుకున్నారు. ఇదిలా ఉండగానే వింత రూమర్లు పుట్టుకొచ్చాయి. సమంతకు ఏదో వింత చర్మ వ్యాధి వచ్చిందట. గతంలోనూ సమంత ఆ చర్మ వ్యాధితో బాధపడుతూ ఉండేదట. అయితే ఇప్పుడు ఆ సమస్య మరీ ఎక్కువగా కావడంతో చికిత్స తీసుకుంటూ ఉందట. అందుకే బయటకు రాలేదట. సినిమా షూటింగ్‌లను కూడా వాయిదా వేసిందట. అంటూ ఇలా రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి.

అయితే దీనిపై సమంత మేనేజర్ స్పందించాడు. సమంత ఆరోగ్యంగా ఉందని, అవన్నీ వదంతులేనని, వట్టి గాలి వార్తలేనని ఖండించాడు. సమంతకు ఎలాంటి చర్మ వ్యాధి లేదని అన్నాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి కథనాలు ప్రచురించే వారి మీద సమంత కఠిన చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉందంటూ మేనేజర్ తెలిపాడు. అలా సమంతకు సంబంధించిన వార్తలకు పుల్ స్టాప్ పడింది. అయితే ఇప్పుడు సమంత అందరినీ ఆశ్చర్యపరిచింది. తన కొత్త సినిమా యశోధకు సంబంధించిన టీజర్‌ను వదిలారు.

Samantha Ruth Prabhu Yasodha Teaser out

Samantha Ruth Prabhu Yasodha Teaser out

ఈ చిత్రంలో సమంత గర్భం దాల్చిన మహిళగా నటిస్తోన్నట్టు కనిపిస్తోంది. టీజర్ ప్రారంభంలోనే మీరు ప్రెగ్నెంట్ అనే డైలాగ్ ఉంది. అయితే ప్రెగ్నెన్నీ సమయంలో ఎలా ఉండాలో డాక్టర్లు చెబుతుంటే.. అందుకు విరుద్దంగా ఆమె జీవితంలో ఘటనలు జరుగుతుంటాయి. మొత్తానికి ఈ టీజర్ మాత్రం జనాల్లో ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసింది. పాన్ ఇండియన్ రేంజ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే.

YouTube video

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది