Priyamani : తెల్లని చీరలో మల్లెపువ్వులా మెరిసిపోతున్న ప్రియమణి.. మైకం తెప్పిస్తున్నాంటున్న నెటిజన్స్
Priyamani : కేరళలో పుట్టి తెలుగమ్మాయిగా ప్రేక్షకుల మనసు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ ప్రియమణి. 2003లో వచ్చిన ఎవడే అతగాడే అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ప్రియమణి పూర్తి పేరు.. ప్రియ వాసుదేవ్ మణి. 1984 జూన్ 4న బెంగళూరులో జన్మించిన ఈ ముద్దుగుమ్మ నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది. ప్రియమణి ఒక్క తెలుగులోనే కాకుండా పలు భాషలలో నటించి మెప్పించింది. వరుసగా ప్రియమణి, జగపతిబాబు సినిమాలు చేయటంతో కొందరు గాసిప్ ప్రియులు వీరిద్దరి మధ్య […]
Priyamani : కేరళలో పుట్టి తెలుగమ్మాయిగా ప్రేక్షకుల మనసు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ ప్రియమణి. 2003లో వచ్చిన ఎవడే అతగాడే అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ప్రియమణి పూర్తి పేరు.. ప్రియ వాసుదేవ్ మణి. 1984 జూన్ 4న బెంగళూరులో జన్మించిన ఈ ముద్దుగుమ్మ నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది. ప్రియమణి ఒక్క తెలుగులోనే కాకుండా పలు భాషలలో నటించి మెప్పించింది. వరుసగా ప్రియమణి, జగపతిబాబు సినిమాలు చేయటంతో కొందరు గాసిప్ ప్రియులు వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న పుకార్లు బాగా ప్రచారం చేశారు.
Priyamani : ప్రియమణి అందాల రచ్చ..
అయితే ఇలాంటి విషయాలను జగపతిబాబు ముందు నుంచి లైట్ తీసుకుంటారు. ప్రియమణితో తనకు ఒక పుకారు ఉందన్న విషయాన్ని కూడా ఆయన అస్సలు పట్టించుకోలేదు. ఈ పుకార్లపై ప్రియమణి మొదట్లో కాస్తంత ఇబ్బంది పడిన, తర్వాత ఆమె కూడా పట్టించుకోవడం మానేసింది. దక్షిణాది నాలుగు భాషల్లోనే కాదు, ఉత్తరాదిన హిందీలోనూ ప్రియమణి నటించింది. తమిళ చిత్రం ‘పరుతివీరన్’తో ఉత్తమనటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతున్న ప్రియమణి అటు సినిమాలు ఇటు డ్యాన్స్ షోలతో పాటు సోషల్ మీడియాలోను నానా రచ్చ చేస్తుంది. అందాలు ఒలకపొయ్యడం లో కూడా ప్రియమణి ఏ మతం వెనకడుగు వెయ్యలేదు. సినిమా సినిమాకి తన గ్లామర్ డోస్ పెంచుతూ ప్రేక్షకులని ఆకట్టుకుంది.
ఇక అప్పటి ప్రియమణి గ్లామర్ పిక్స్ ఇప్పుదు ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఇందులో తెల్లని చీరకట్టులో మల్లెపువ్వులా అందాలు ఆరబోస్తూ మెరిసిపోతుంది ప్రియమణి. ఈ అమ్మడిని ఇలా చూసి మెస్మరైజ్ అవుతున్నారు. ప్రియమణి క్యూట్‌నెస్కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ప్రియమణి క్యూట్ పిక్స్ నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. స్కూల్ డేస్ నుంచి ప్రియమణి స్కూల్ లో జరిగే ఫంక్షన్స్ లో పాల్గొనేది. ఆమె ఉత్సాహం చూసి కన్నవారు సైతం ప్రోత్సహించారు. చదువు కాగానే కాంచీపురం సిల్క్స్ కు మోడల్ గా కనిపించింది ప్రియమణి. బీఏ వరకు చదువుకున్న ప్రియమణి ఆ తర్వాత సినిమాల వైపు ఆసక్తి చూపించారు.మిత్రుడు, ప్రవరాఖ్యుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, రాజ్, రక్తచరిత్ర.. ఇలా చాలా చిత్రాల్లో నటించి మంచి ప్రశంసలు పొందింది.
View this post on Instagram