Samantha : అర్ధరాత్రి వస్తావా అంటూ సమంతకు మెసేజ్ చేసిన వ్యక్తి.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : అర్ధరాత్రి వస్తావా అంటూ సమంతకు మెసేజ్ చేసిన వ్యక్తి.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

 Authored By kranthi | The Telugu News | Updated on :17 October 2023,8:00 pm

Samantha : సమంత రుతుప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు కొనసాగింది. తెలుగుతో పాటు తమిళం ఇండస్ట్రీలోనూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణించింది. కానీ.. ఇండస్ట్రీలో తనవి రెండు ఇన్నింగ్స్ అని చెప్పుకోవాలి. పెళ్లికి ముందు ఒక ఇన్నింగ్స్, పెళ్లి తర్వాత మరో ఇన్నింగ్స్. ఎందుకంటే.. పెళ్లికి ముందు తన కెరీర్ ఓ రేంజ్ లో ఉండేది. పెళ్లి తర్వాత తనకు కొంచెం అవకాశాలు తగ్గినా.. ఇండస్ట్రీలో మాత్రం సినిమాలు చేసింది. ఆ తర్వాత కొన్నేళ్లకే విడాకులు తీసుకోవడంతో తన వ్యక్తిగత జీవితం విషయంలో బాగా డిస్టర్బ్ అయింది సమంత. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అంతే కాదు.. కొన్ని రోజుల పాటు తనను అరుదైన వ్యాధి వేధించేది. ఆ వ్యాధికి ట్రీట్ మెంట్ కూడా తీసుకుంది. ట్రీట్ మెంట్ కోసం సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చింది.

ఆ వ్యాధి నయం అయ్యాక మళ్లీ ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. తనకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవలే తను ఖుషీ సినిమాలో నటించి మంచి ప్రశంసలు అందుకుంది. ఇక.. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఓ వ్యక్తి తనను బాగా విసిగిస్తున్నాడట. వస్తావా అంటూ అర్ధరాత్రి మెసేజ్ లు చేస్తున్నాడట. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది. అసలు ఏం జరిగింది అంటే సమంత జిమ్ ట్రెయినర్ తనకు అర్ధరాత్రి మెసేజ్ చేశాడట. ఉదయమే జిమ్ కు వస్తున్నావా అని అడిగాడట. దీంతో నేను రాను.. బాడీ పెయిన్స్ ఉన్నాయి. లీవ్ తీసుకుంటా అని చెప్పిందట సమంత.

samantha ruthuprabhu gets message in whatsapp

#image_title

Samantha : అయినా వినని జిమ్ ట్రెయినర్

లీవ్ తీసుకుంటా అని చెప్పినా కూడా జిమ్ ట్రెయినర్ వినలేదట. తనతో ఎలాగైనా వర్కవుట్ చేయించాలని అర్ధరాత్రి అలా మెసేజ్ చేశారట. అయినా కూడా ట్రెయినర్ ఇక్కడే ఉన్నా వస్తావా అని ట్రెయినర్ అడిగాడట. రానని చెప్పినా కూడా వినకుండా సమంతను తీసుకెళ్లి బలవంతంగా తనతో వర్కవుట్స్ చేయించారంటూ దానికి సంబంధించి పోస్ట్ చేసింది సమంత. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది