Samantha : ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత సమంత రెండు పెళ్లి పై నిర్ణయం…!

 Authored By prabhas | The Telugu News | Updated on :20 December 2022,6:20 pm

Samantha : టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న సమంత అనూహ్యంగా మయో సైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. నాగ చైతన్య నుండి విడిపోయి ఇప్పుడిప్పుడే లైఫ్ లో కుదుటపడుతున్న సమంత అనూహ్యంగా ఇలా అనారోగ్యం బారిన పడడంతో ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఆ డిప్రెషన్ నుండి బయట పడేందుకు ఎక్కువ సినిమాలు కమిట్ అయింది. ఆ సినిమాలో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకోగా ఇంకా కొన్ని పూర్తి అవలేదు,కొన్ని చివరి దశలో ఉన్నాయి.

మరి కొన్ని సినిమాలు కమిట్ అయి ఇంకా ప్రారంభం కాలేదు. మరో వైపు సమంత రెండవ పెళ్లి గురించి కూడా ప్రచారం జరుగుతుంది. సమంత రెండో పెళ్లి చేసుకునే విషయమై సన్నిహితులతో చర్చలు జరిపిందనే వార్తల ఆ మధ్య వచ్చాయి. ఆమె ను ఎంతో ఇష్టపడే ఒక వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడట. కానీ సమంత మాత్రం పెళ్లి గురించి నిర్ణయం తీసుకోకుండా ఆలోచనల్లో ఉందని తెలుస్తుంది. ఈ లోపు ఆమె ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పెళ్లి గురించిన ఆలోచన పక్కకు పెట్టారట. సమంత ఆరోగ్యం పూర్తిగా కుదరటం పడ్డ తర్వాత రెండో పెళ్లి గురించిన చర్చలు మళ్ళీ మొదలయ్యే

samantha second marriage news and her health update

samantha second marriage news and her health update

అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. సమంత అభిమానులు మాత్రం ఈ సమయంలో సమంత పెళ్లి గురించి వార్తలు రావడం విడ్డూరంగా ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినా సమంత రెండో పెళ్లి గురించి అసలు ఆలోచన చేయలేదని ఆమెకు ఆసక్తి కూడా లేదని కొందరు అంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఆమె అనారోగ్యం నుండి పూర్తిగా కోరుకున్న తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని, ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి