Samantha : సమంత అందాల విన్యాసం.. మతులు పోతున్నాయంటున్న ఫ్యాన్స్
Samantha: అందాలముద్దుగుమ్మ సమంత ఇటీవల కాలంలో చేసే సందడి మాములుగా లేదు. ఆమె పోస్ట్ చేసే కొటేషన్స్ , షేర్ చేసే ఫొటోలు మతులు పోగొడుతుంటాయి. సమంత.. ఇటీవల తన స్టయిలిస్ట్ ప్రీతమ్‌తో `ఐ లవ్ యూ`, `ఐటూ లవ్ యూ` అంటూ పంచుకున్న పోస్టులు ఇటీవల దుమారం రేపాయి. వీరిద్దరి మధ్య ఇంకేదో ఉందనే గుసగుసలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే సమంత దీన్ని ఉద్దేశించిన కామెంట్ పెట్టి ఉండొచ్చా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేక నాగచైతన్యకి సంబంధించిన విషయంలో ఆమె ఇలా పరోక్షంగా పోస్ట్ లు పెడుతుందా? అనేది సస్పెన్స్ గా, ఆసక్తికరంగా మారాయి.
ఇక నాలుగేండ్ల దాంపత్య జీవితం అనంతరం నాగచైతన్య, సమంత విడిపోతున్నట్టు గతేడాది అక్టోబర్ 2న ప్రకటించిన విషయం తెలిసిందే.వీరిద్దరి అనుహ్య ప్రకటన అందరిని షాక్‌కి గురి చేసింది. విడిపోవడానికి కారణాలేంటనేది తెలియాల్సి ఉంది. అయితే అంతకంటే ముందే గత మూడు నెలలుగా వీరిద్దరి పోస్ట్ లు, సమంత తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి అక్కినేని అనే పదాన్ని తొలగించడం అనుమానాలు రేకెత్తించాయి. ఊహించినట్టే వీరిద్దరు విడిపోయారు. అయితే చైతూ నుండి విడిపోయిన తర్వాత సమంత చేసే పోస్ట్‌లు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తాజాగా నెమలి కన్నా అందంగా కనిపిస్తూ మెస్మరైజ్ చేసింది సమంత. వయసుతో పాటు ఇచ్చిన మెచ్యురిటీ ఇది’ అంటూ సమంత పేర్కొంది.

samantha stills for peacock
Samantha : సమంత అందాలకు ముగ్ధులవ్వాల్సిందే..
ఇక సామ్ లేటెస్ట్ సమంత ఫోటోపై రియాక్ట్ అయిన హీరోయిన్ తమన్నా బ్యూటీ అంటూ కామెంట్ చేసింది.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సూపర్ బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లతో కేక పెట్టిస్తున్నారు. అంతేకాదు వరుస చిత్రాలతో బిజీగా ఉంటూనే… మరో పక్క సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. తెలుగు,తమిళ్,హిందీ భాషాల్లో వరుస సినిమాలు చేస్తోంది. సామ్ నటిస్తున్న సినిమాల్లో యశోద ఒకటి. ఈ సినిమాను హరి – హరీష్ తొలిసారిగా డైరెక్షన్ చేస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల విడుదల చేయనున్నారు.