Samantha : తనని ట్రోల్ చేసే వారికి గట్టిగా బుద్ది చెప్పిన సమంత.. దమ్ముంటే అది చెయ్..!
ప్రధానాంశాలు:
Samantha : తనని ట్రోల్ చేసే వారికి గట్టిగా బుద్ది చెప్పిన సమంత.. దమ్ముంటే అది చెయ్..!
Samantha : టాలీవుడ్ నటి సమంత ఇటీవల సినిమాల కన్నా వార్తల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆమెపై సోషల్ మీడియా వేదికగా కొందరు ట్రోల్ చేసిన తర్వాత, వారికి సమంత గట్టిగా సమాధానం ఇచ్చారు. తాను పడుతున్న ఆరోగ్య సమస్యల్ని పక్కనపెట్టి, శరీరాన్ని చూసి కామెంట్లు చేయడం బాధాకరమంటూ ఘాటుగా స్పందించారు.

Samantha : తనని ట్రోల్ చేసే వారికి గట్టిగా బుద్ది చెప్పిన సమంత.. దమ్ముంటే అది చెయ్..!
Samantha : దటీజ్ సమంత..
తాజాగా సోషల్ మీడియాలో సమంత షేర్ చేసిన ఫొటోలపై కొందరు నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేశారు. ‘‘సమంత బాగా బరువు తగ్గింది’’, ‘‘అనారోగ్యంగా కనిపిస్తోంది’’ వంటి విమర్శలు ఆమెపై వరుసగా వచ్చాయి. దీంతో అసహనం వ్యక్తం చేసిన సమంత.. ముందుగా మీరు మూడు పుల్‌అప్స్ చేయండి… తర్వాతే నన్ను ట్రోల్ చేయండి. అంత వరకూ, దయచేసి మీ వ్యాఖ్యలు దాచుకోండి అని కౌంటర్ ఇచ్చారు.
ఈ పోస్టుతో ఆమె తన శరీరంపై వచ్చే విమర్శలకు గట్టిగా జవాబిచ్చారు. శారీరకంగా కోలుకుంటున్న సమయంలో నెగటివ్ కామెంట్లు అవసరం లేదన్న సందేశాన్ని సమంత క్లియర్‌గా ఇచ్చారు. సమంత రియాక్షన్ నెటిజన్ల మధ్య చర్చనీయాంశమైంది. ఆమెకు మద్దతుగా పలువురు అభిమానులు.. ఆరోగ్యపరమైన విషయాలపై కామెంట్లు చేయడం ఎంతవరకు న్యాయం? అంటూ ట్రోల్స్‌ను నిలదీశారు.