Vijay Devarakonda : సమంతకి విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ ఇస్తే, ఇప్పుడు విజయ్‌కి సామ్ థ్రిల్ ఇచ్చిందిగా..!
Vijay Devarakonda : టాలీవుడ్‌లో ప్రస్తుతం క్రేజీ కాంబినేషన్స్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సమంత, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలలో శివ నిర్వాణ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గత కొద్ది రోజులుగా కాశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంటుంది.అయితే ఇటీవల సమంత బర్త్ డే జరగగా, ఆ సమయంలో విజయ్ దేవరకొండ చేసిన సందడి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామ్‌కి మెమోరబుల్ గిఫ్ట్ ఇచ్చాడు.ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా సమంత ఆయన బర్త్ డే సెలబ్రేట్ చేసింది. విజయ్ 33వ వడిలోకి అడుగుపెడుతున్నాడు.
ఇప్పటివరకూ సోలో హీరోగా కొద్ది సినిమాలే చేసినా… తెలుగుతో పాటు హిందీ సహా ఇతర భాషల్లోనూ క్రేజ్ సంపాదించుకున్నాడు.విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, వీడియోలతో రౌడీ స్టార్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. దర్శకుడు శివ నిర్వాణ టీమ్ కూడా విజయ్ బర్త్ డేని సెలబ్రేట్ చేసినట్లు తెలుస్తోంది. శివ నిర్వాణ, హీరోయిన్ సమంత, తన పేరెంట్స్‌తో కలిసి విజయ్ బర్త్ డే జరుపుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సమంతని చాలా ఆప్యాయంగా విజయ్ దగ్గరకు తీసుకొని ఫొటోలు దిగాడు.ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండకు ట్విట్టర్‌లో విషెస్ తెలియజేశారు.

samantha surprise to vijay devarakonda
Vijay Devarakonda : విజయ్ బర్త్ డే హంగామా..
‘నేను నీలోని ఫైర్‌ని చూశాను… నీలోని మంచి నటుడిని చూశాను… నీ మనస్సులో ఏం మెదులుతుందో నాకు తెలుసు… నీ తపన, నీ పిచ్చి, నీ నిబద్దత, నీ వినయం… ఇవన్నీ నిన్ను ఉన్నత స్థానాలకు చేరుస్తాయి. ఏదో ఒకరోజు నువ్వు దేశం గర్వించే స్థాయికి వెళ్తావు. ఇప్పటికైతే నిన్ను ‘ది విజయ్ దేవరకొండ’ అంటాను. హ్యాపీ బర్త్ డే…’ అంటూ తనదైన స్టైల్లో విషెస్ చెప్పారు పూరి.విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లైగర్’ సినిమా ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. లైగర్ విడుదల కాకముందే విజయ్, పూరి కలిసి ‘జన గణ మన’ ప్రాజెక్టును లైన్‌లో పెట్టారు.