Samantha : అక్కినేని మాజీ కోడలు సమంత సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఆమె వెండితెర మీద కనిపించి సంవత్సరం దాటి పోయింది. అయినా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆరోగ్య సమస్యలతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడు కోలుకొని తిరిగి సినిమాలు చేసే పనిలో పడింది. సమంత ప్రస్తుతం ”సిటాడెల్” అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.హాలీవుడ్ లో ఇండియన్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటించిన ‘సిటాడెల్’కు ఇండియన్ వెర్షన్ గా ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది.
‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ లాంటి సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ లను తెరకెక్కించిన రాజ్, డీకే ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నది. త్వరలో ప్రేక్షకుల ముదుకు రాబోతున్నది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. రెండో ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. ట్రైలర్‌లో వరుణ్ ధావన్‌తో పాటు సమంత కూడా యాక్షన్ సీక్వెన్స్ చేసినట్టు స్పష్టం అవుతోంది. ఇదే విధంగా ఈ వెబ్ సిరీస్‌లో సమంత బొల్డ్‌గా కనిపించారనే టాక్ వినిపిస్తోంది. ట్రైలర్‌లో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నట్టు చూపించారు.
దీంతో వెబ్ సిరీస్‌లో రొమాంటిక్ సీన్స్‌కు కొదవలేదని అర్ధం అవుతోంది. వరుణ్ ధావన్-సమంతల మధ్య బొల్డ్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఆ సీన్లలో వీరిద్దరు రెచ్చిపోయి నటించారనే టాక్ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలోని ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఇందులో ధావన్ కౌగిలిలో సమంత మునిగిపోయింది.గట్టిగా హత్తుకుని ఇరువురు బాండింగ్ ని హైలైట్ చేశారు.ఈ ఫొటోకి ఈగ సినిమాలోని ‘నేను నానీనే’ అనే తెలుగు వెర్షన్ సాంగ్‌ని యాడ్ చేశారు. ఈ పాట వాళ్ల మధ్య రొమాంటిక్ బాండింగ్‌కి పర్పెక్ట్ సూట్ అయింది. ఇక వరుణ్ ధావన్, సమంతల కెమిస్టీ గురించి నిర్మాత నిర్మాత గినా గార్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇటీవల సమంత డోస్ బాగానే పెంచినట్టు కనిపిస్తుంది.
TTD Chairman : తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. ఈ నిర్ణయం ప్రపంచంలోని అతిపెద్ద…
AP Govt Good News : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శుభవార్తల మీద శుభవార్తల మీద…
Ginger Hair Fall : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే సమస్యలలో జుట్టు రాలే సమస్య కూడా…
Giloy Leaves : మన పరిసర ప్రాంతంలో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి. వాటిని మనం పిచ్చి మొక్కలు…
Bigg Boss 8 Telugu : ఈ వారం బిగ్ బాస్ హౌజ్ లో ఒక్కరోజుకే నామినేషన్ ప్రక్రియ పూర్తైంది.ఆ…
Skin Care : సాధారణంగా ప్రతి ఒక్కరికి మోచేతులపై మరియు మోకాళ్లపై నలుపు అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే మన శరీరం…
Post Office : సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
Health Benefits : మన శరీరానికి జామ ఎంత మేలు చేస్తుందో మన అందరికీ తెలిసినదే. కానీ ఈ జామ…
This website uses cookies.