Sampoornesh Babu : ఇటీవల మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ – ఐశ్వర్య రాజేశ్ జంటగా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్ వారితో కలిసి జె భగవాన్, పుల్లారావు నిర్మించారు. అక్టోబర్ 1న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా.. తాజాగా, గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సాధారణంగా ఏ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చినా కేవలం ఆ సినిమా గురించే మాట్లాడి వెళ్ళిపోయే పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం వైసీపి నాయకుల మీద, జగన్ ప్రభూత్వం మీద విరుచుకుపడ్డారు.
ఏకంగా సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానినీతే ‘సన్నాని’ అని సంబోధించారు. అక్కడ నాయకత్వ తీరును, వైసీపి నాయకులు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభూత్వం సినిమా ఇండస్ట్రీని పెడుతున్న ఇబ్బందులను గురించి చాలా ఆవేశంగా మాట్లాడారు. మీకు నా మీద కోపం ఉంటే నా సినిమాలు ఆపుకొండి, కానీ మావాళ్ళని వదిలేయండి అంటూ చెప్పుకొచ్చారు. కష్టపడి సినిమాలు మేము చేసుకుంటే టికెట్లు మీరు అమ్ముకుంటారా అంటూ మండిపడ్డారు. ఇండస్ట్రీని ఆదుకోవాలని మంత్రులను కోరుతూనే ..సినిమా ఇండస్ట్రీ జోలికొస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.
దీనిపై పెద్ద రచ్చ, దుమారమే రేగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నెల్లూరు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ లో టికెటస్ అమ్మితే తప్పేంటి.. మాకు సంపూర్ణేష్ బాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా ఒక్కటే.. అంటూ కామెంట్ చేశాడు. దీనికి సంపూర్ణేశ్ బాబు రియాక్ట్ అయ్యాడు. తన స్టైల్లో స్పందించిన సంపూ..ఇక్కడ పవర్ స్టార్‌కి పూర్తిగా సపోర్ట్ చేస్తూనే..మంత్రి అనిల్ కుమార్‌కి కౌంటర్ ఇచ్చాడు.
తాజాగా సంపూ ట్వీట్‌లో ..”మంత్రి అనిల్ గారు, మంచి మనసున్న మా పవన్ కళ్యాణ్ గారితో సమానంగా నన్ను చూడటం ఆనందకరం. ఏ సమస్య వచ్చినా పెద్ద మనసుతో స్పందించే తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు బాధల్లో వున్నారు. అదే పెద్ద మనసుతో అవి పరిష్కారం అయ్యేలా చూడగలరు”..అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇప్పుడు సంపూ ఇచ్చిన ఈ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.