Samyuktha Hegde : హీరోయిన్‌వి నీకెందుక‌మ్మా.. స్టంట్స్ చేసి మంచం మీద ప‌డిందిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: July 28, 2022, 10:00 pm

Samyuktha Hegde : సాధార‌ణంగా హీరోలు స్టంట్స్ చేస్తూ అభిమానుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. కాని ఈ మ‌ధ్య హీరోయిన్స్ కూడా స్టంట్స్ చేస్తూ అబ్బుర‌ప‌రుస్తున్నారు. అయితే హీరోయిన్స్ స్టంట్స్ చేసే స‌మ‌యంలో ఒక్కోసారి దారుణ‌మైన ప్ర‌మాదాలు కూడా జ‌రుగుతుంటాయి. తాజాగా కన్నడ నాట వివాదాస్పద హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త హెగ్డే తెలుగులో కిరాక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో సత్య అనే పాత్రతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఆమెకు మరో తెలుగు సినిమా అవకాశం దక్కలేదు. కానీ వరుసగా తమిళ, కన్నడ సినీ అవకాశాలు దక్కించుకుని వరుస సినిమా షూటింగ్స్ తో ముందుకు వెళుతోంది.

ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న కన్నడ మూవీ క్రీమ్‌ షూటింగ్‌లో భాగంగా ఫైట్ సీన్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా రౌడీలను కొట్టే సందర్భంలో స్టంట్ చేసే క్రమంలో ఆమె కాలికి గాయమైంది. వెంటనే ఆమెను మూవీ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, మేకింగ్ వీడియోను ఈ అందగత్తె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వరుసగా స్టంట్స్ కొట్టే సమయంలో కాలుకు తీవ్రంగా గాయమైంది. దీంతో అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే చిత్ర యూనిట్ ఆమె వద్దకు వచ్చి హుఠాహుఠినా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమెను కొద్ది రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. షూటింగ్ సమయంలో సంయుక్తా మీనన్ ఎలా గాయపడిందో ఆడియెన్స్ కు తెలియజేసేందుకు మేకింగ్ వీడియోను షేర్ చేసింది.

samyuktha hegde injured

samyuktha hegde injured

Samyuktha Hegde : భ‌లే ప‌ని అయిందిగా..!

వీడియో చూసిన తన అభిమానులు, ఆడియెన్స్ ను త్వరగా కోలుకోవాలని దేవుడి ప్రార్థిస్తున్నారు. వీడియో షేర్ చేస్తూ సంయుక్తా ఇలా కామెంట్స్ చేసింది. టేకింగ్ లో తనకు గాయమైనా.. సినిమా రిలీజ్ తర్వాత ఆ ఫైట్ చూసి ప్రేక్షకులు ఖుషీ అవుతారని తెలిపింది. తెలుగులో ఒక్క చిత్రంలోనే నటించిన ఈ బ్యూటీ కన్నడ, తమిళంలో మాత్రం వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే గాయం వల్ల తాను బాధపడుతూ ఇంటికే పరిమితమైనా సరే సినిమా విడుదలైన తర్వాత ఆ ఫైట్ సీన్ చూసి కచ్చితంగా ప్రేక్షకులు తనను మెచ్చుకుంటారని తనకు నమ్మకం ఉందంటూ ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp