Samyuktha Menon : చార్మినార్ చౌర‌స్తాలో భీమ్లా నాయ‌క్ హీరోయిన్‌కి ఏం పని ?

Authored By Sam C | The Telugu News | Published on: February 26, 2022, 1:30 pm

Samyuktha Menon : సంయుక్త మీన‌న్.. ఈ అమ్మ‌డు భీమ్లా నాయ‌క్ సినిమాతో పాపులారిటీ అందుకుంది. ఒక‌ప్పుడు త‌మిళం, మ‌ల‌యాళ సినిమాల‌లో న‌టించిన ఈ ముద్దుగుమ్మ భీమ్లా నాయ‌క్ సినిమాతో పాపులారిటీ అందుకుంది. ఓ వైపు థియేటర్‌లో హీరోయిన్‌ సంయుక్త మీనన్ నటించిన `భీమ్లా నాయక్‌` సినిమా మోతమోగుతుంది. మరోవైపు ఈ అందాల భామ శుక్రవారం చార్మినార్‌ వద్ద సందడి చేసింది. సాంప్రదాయ దుస్తుల్లో చార్మినార్‌ అందాలను తిలకించింది. ఐకానిక్‌ చార్మినార్‌ అందాలను ఆస్వాదిస్తూ మంత్ర ముగ్దులయ్యింది. ప్ర‌స్తుతం సంయుక్త మీన‌న్ క్యూట్ పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

భీమ్లా నాయ‌క్ చిత్రంలో సంయుక్త మీనన్‌.. రానా నటించిన డానియెల్‌ శేఖర్‌ భార్య పాత్రలో నటించింది. మలయాళంతో పోల్చితే హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత పెంచడంతో సంయుక్త మీనన్‌ పాత్రకి కాస్త గుర్తింపు దక్కింది. అందుకే అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటుంది. అయితే `భీమ్లా నాయక్‌` ప్రమోషన్‌లో మరో హీరోయిన్‌ నిత్యా మీనన్‌ దూరంగా ఉండటంతో ఇప్పుడు అందరి చూపులు సంయుక్త మీనన్‌ వైపు పడ్డాయని చెప్పొచ్చు. పైగా కొత్త బ్యూటీ కావడంతో మరింత స్పెషల్‌గా మారింది. `భీమ్లా నాయక్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనూ ఈ బ్యూటీ చీరకట్టులో మెరిసి మరింత స్పెషల్‌ గా మారింది.

samyuktha menon at charminar chowrastha

samyuktha menon at charminar chowrastha

Samyuktha Menon : సంయుక్త మీన‌న్ సంద‌డి..

మరోవైపు తనదైన స్పీచ్‌తోనూ ఆకట్టుకుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తోన్న లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ భీమ్లానాయక్.. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం నేడు(ఫిబ్రవరి 25)న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రమోషన్‌‌లో భాగంగా చిత్రయూనిట్ నిన్న హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ పోలీస్‌ లైన్స్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ని గ్రాండ్‌‌గా నిర్వహించింది. ఈ ఈవెంట్‌‌కి తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిధిగా వచ్చారు. ఈ ఈవెంట్‌లో సంయుక్త మీన‌న్ తెలుగులో స్పీచ్ ఇచ్చి అద‌ర‌గొట్టింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp