Kalyan Ram Devil Movie Review : కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kalyan Ram Devil Movie Review : కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

 Authored By gatla | The Telugu News | Updated on :28 December 2023,11:50 pm

ప్రధానాంశాలు:

  •  Kalyan Ram Devil Movie Review : కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

  •  కళ్యాణ్ రామ్ ,సంయుక్త మీనన్ న‌టించిన డెవిల్ మూవీ డిసెంబ‌ర్ 29న విడుద‌ల‌

Kalyan Ram Devil Movie Review : Devil Movie Review , నందమూరి కళ్యాణ్ రామ్ అనగానే మనకు గుర్తొచ్చే తొలి మూవీ అతనొక్కడే. ఆ సినిమాతోనే కళ్యాణ్ రామ్ అంటే ఎవరో సినీ ప్రేక్షకులకు తెలిసింది. ఒక సీనియర్ ఎన్టీఆర్ మనవడిగానే కాకుండా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు కళ్యాణ్ రామ్. సినిమా ఇండస్ట్రీలో రాణించడానికి కళ్యాణ్ రామ్ చాలా కష్టపడాల్సి వచ్చింది. అతనొక్కడే సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోగా నటించినా అనుకున్న హిట్ దొరకలేదు కళ్యాణ్ రామ్ కు. అయినా కూడా పట్టు వదలకుండా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత పటాస్ రూపంలో మరో హిట్ దొరికింది. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు కళ్యాణ్ రామ్ కు. రీసెంట్ గా బింబిసారతో మరో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన మూవీ డెవిల్. ఈ మూవీ న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 29, 2023 న విడుదల అయింది.

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ అయ్యంగార్, సత్య ముఖ్య పాత్రల్లో నటించారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరించారు. నవీన్ మేడారం డైరెక్టర్. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించారు. ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రివ్యూ షోలను ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రదర్శించారు. ఇండస్ట్రీలోని కొందరు పెద్దల కోసం కూడా ఈ సినిమా ప్రివ్యూను ప్రదర్శించారు. నందమూరి ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షోలు కూడా ప్రదర్శించారు. మరి వరుస హిట్లతో ఫామ్ లో ఉన్న కళ్యాణ్ రామ్ కు డెవిల్ మూవీ హిట్ ఇచ్చిందా.. ప్రేక్షకులను మరోసారి ఈ డెవిల్ మెప్పించాడా లేదా తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

Kalyan Ram Devil Movie Review కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Kalyan Ram Devil Movie Review : కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

Kalyan Ram Devil Movie Review : కథ

రససాడు అనే దివాణంలో ఒక హత్య జరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారో తెలుసుకోవడం కోసం డెవిల్ వస్తాడు. ఈ సినిమాలో డెవిల్ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించాడు. నిజానికి డెవిల్.. బ్రిటిషర్ల సీక్రెట్ ఏంజెట్. ఆ దివాణంలో హత్య కోసం సీక్రెట్ ఏజెంట్ ఎందుకు వచ్చాడు అనేదే ట్విస్ట్. మరోవైపు నైషధ(సంయుక్త మీనన్) పాత్ర కూడా ఈ కథలో చాలా కీలకం. నేతాజీ కలలు కన్న సమాజం కోసం జరిగిన విప్లవానికి, మాళవిక నాయర్ కు ఉన్న సంబంధం ఏంటి? ఆ హత్య ఎవరు చేశారు? ఎవరిని హత్య చేశారు? వాళ్లకు కళ్యాణ్ రామ్ పట్టుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమాను వెండితెర మీద చూడాల్సిందే.

Kalyan Ram Devil Movie Review : విశ్లేషణ

సినిమా పేరు డెవిల్.. అంటే దెయ్యం అని అర్థం. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఈ సినిమా క్యాప్షన్. బ్రిటీషర్లు.. మన భారతదేశాన్ని పాలించినప్పుడు జరిగిన కథ ఇది. బ్రిటీషర్ల కాలంలో బ్రిటీషర్ల కోసం భారత్ కు చెందిన ఓ వ్యక్తి ఎలా వాళ్ల కోసం పని చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది. బ్రిటీషర్ల కోసం పని చేసిన తర్వాత బ్రిటీషర్ల పైనే ఆ వ్యక్తి ఎందుకు ఎదురు తిరిగాడు. సొంత దేశానికి బ్రిటీషర్ల కోసం ద్రోహం చేస్తాడా? లేక బ్రిటీషర్లకే సపోర్ట్ చేస్తాడా? అసలు ఏం జరిగింది అనేదే మిగితా కథ. ఈ సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా బ్రిటీషర్ల కాలంలో మన భారత్ ఎలా ఉండేది. మన వేషభాషలు ఎలా ఉండేవి.. అవన్నీ కళ్లకు కట్టినట్టుగా డైరెక్టర్ చూపించాడు. ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అదుర్స్ అని చెప్పుకోవాలి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ సూపర్బ్. అలాగే.. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

1940 బ్యాక్ డ్రాప్ లో జరిగే సినిమా కావడం, హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా ఉండటమే ఈ సినిమా స్పెషాలిటీ. మీరు హాలీవుడ్ సినిమాలు చూస్తే.. షెర్లాక్ హోమ్స్ గురించి తెలుసు కదా. ఆ సినిమాలను గమనిస్తే.. అందులో చేసే ఇన్వెస్టిగేషన్ టైప్ లో ఇవి ఉంటాయి. అదే తరహాలో ఈ మూవీ కూడా ఉంటుంది. డెవిల్ సినిమా బ్రిటిషర్ల కాలంలో జరిగినప్పటికీ ఇది నిజమైన కథ కాదు.. కల్పిత కథతోనే ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే.. బ్రిటిష్ కాలానికి, ఈ సినిమాకు ఏం సంబంధం ఉండదు. కేవలం సినిమా నేపథ్యం కోసం బ్రిటీష్ కాలాన్ని తీసుకొని ఈ సినిమాకు కథ రాసుకున్నాడు డైరెక్టర్. కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఏమాత్రం మిస్ కావు.

ప్లస్ పాయింట్స్

కళ్యాణ్ రామ్ నటన

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్

దారి తప్పిన కథనం

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది