Balakrishna : గుర్రం చేత డ్యాన్స్ చేయించిన బాల‌కృష్ణ ఆయ‌న త‌న‌యుడు.. నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్న వీడియో

0
Advertisement

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ ఫ్యామిలీ ప్ర‌స్తుతం సంక్రాంతి సెల‌బ్రేష‌న్ మూడ్‌లో ఉన్నారు. అఖండ స‌క్సెస్‌తో పాటు ఆయ‌న హోస్ట్ చేసిన అన్‌స్టాప‌బుల్ షో మంచి రికార్డులు సాధిస్తున్న నేప‌థ్యంలో బాల‌య్య జోరుకి అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోతున్నాం. రాజ‌కీయాలు, సినిమాల‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన బాల‌కృష్ణ‌ ప్రకాశం జిల్లాలోని కారంచేడులో వున్న తన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి ఇంటికి వెళ్లారు. అక్కడ బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి సందడి చేశారు. గుర్రం పైకి ఎక్కి బాలయ్య చేసిన హంగామా మామూలుగా లేదు.బాలకృష్ణ, మోక్షజ్ఞ ఇద్దరూ కూడా గర్రం ఎక్కి సందడి చేశారు. కొడుకు గుర్రమెక్కితే తండ్రి పట్టుకున్నాడు.. తండ్రి గుర్రమెక్కితో కొడుకు పట్టుకున్నాడు.

ఇక తండ్రి, కొడుకులు కూడా గుర్రం చేత డ్యాన్స్ చేయించి భ‌ళా అనిపించారు. బాలయ్య, మోక్షజ్ఞల ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతన్నాయి. ఇలా బాలయ్య సందడి చేస్తుంటే.. చుట్టు పక్కల నుంచి అభిమానులు వచ్చి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. పక్కనే ఆయన సతీమణి వసుంధర కూడా నిలిచి బాలయ్య జోష్కి మురిసిపోయారు. బాలయ్య గుర్రం మీద స్వారీ చేయాలని ప్రయత్నిస్తున్న వేళ ఆ జిల్లా నలుమూల నుంచి వచ్చిన అభిమానులు జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు.

sankranti balakrishna video viral
sankranti balakrishna video viral

Balakrishna : గుర్రమెక్కిన మోక్షజ్ఞ..

వాయిద్యాలతో స్థానికులు పాటలు పాడుతుంటే బాలయ్య గుర్రంపై డ్యాన్స్ చేయడం ఆకట్టుకుంటోంది. బాల‌య్య ప్ర‌స్తుతం కారంచేడులో ఉన్నాడ‌ని తెలిసి చుట్టుప‌క్క‌ల ఉన్న‌జ‌నాలు కూడా ఆయ‌న‌ను చూసేందుకు వ‌స్తున్నారు. `అఖండ` మూవీ అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె ` టాక్ షో సక్సెస్ కావడంతో రెట్టించిన ఉత్సాహంతో వున్న బాలకృష్ణ ఈ సంక్రాంతిని మ‌రింత జోష్‌తో జ‌రుపుకుంటున్నాడు. త్వ‌ర‌లో ఆయ‌న గోపిచంద్ మ‌లినేనితో క‌లిసి సినిమా చేయ‌నున్నాడు.

Advertisement