Ram Charan : రామ్ చరణ్ తో రొమాన్స్ చేయబోతున్న సచిన్ టెండూల్కర్ కూతురు ..!

Authored By aruna | The Telugu News | Published on: November 20, 2023, 7:49 pm
  •  Ram Charan : రామ్ చరణ్ తో రొమాన్స్ చేయబోతున్న సచిన్ టెండూల్కర్ కూతురు ..!

  •  సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్

Ram Charan : ప్రస్తుతం సోషల్ మీడియా Social Media లో ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan కు జోడిగా సచిన్ టెండూల్కర్ కూతురు నటించనున్నారని టాక్ వినిపిస్తుంది. రామ్ చరణ్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తో కలిసి ఓ సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం లేని అమ్మాయిని పెడితే బాగుంటుందని డైరెక్టర్ ఫిక్స్ అయ్యారట. అయితే బాలీవుడ్ లో వినిపిస్తున్న క్రేజీ న్యూస్ ప్రకారం రామ్ చరణ్ సరసన సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే పలుమార్లు రాజ్ కుమార్ హిరానీతో సచిన్ టెండూల్కర్ చర్చలు జరిపి తన కూతుర్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చెప్పారట. ఇక సచిన్ వచ్చి స్వయంగా అడగటంతో మంచి కథ వచ్చినప్పుడు నేనే మీకు చెబుతాను అని డైరెక్టర్ మాట ఇచ్చారట. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తో చేయబోయే సినిమా ద్వారా సారా టెండూల్కర్ Sara tendulkar ను హీరోయిన్ గా పరిచయం చేయాలని డైరెక్టర్ భావిస్తున్నారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో ఈ వార్త నిజం అవ్వాలని రామ్ చరణ్ అభిమానులతో పాటు సచిన్ టెండూల్కర్ అభిమానులు కూడా భావిస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో ‘ గేమ్ ఛేంజర్ ‘ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో కూడా సినిమా చేస్తారని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే బుచ్చిబాబుతో సినిమా చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లో కూడా సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని రామ్ చరణ్ భావిస్తున్నారట. రామ్ చరణ్ రాజకుమార్ హీరోని కాంబినేషన్లో రాబోయే సినిమాలో సారా టెండూల్కర్ ని హీరోయిన్గా తీసుకున్నట్లు తెలుస్తుంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp