Bigg Boss Sarayu : బాగానే హర్ట్ అయినట్టుంది.. ఆ ఘటనను ఇంకా మరిచిపోని బిగ్ బాస్ సరయు

 Authored By prabhas | The Telugu News | Updated on :23 May 2022,7:30 pm

Bigg Boss Sarayu : బిగ్ బాస్ షో కంటే సరయు ముందుగానే ఫేమస్ అయింది. యూట్యూబ్‌లో సరయు మాట్లాడే పిచ్చి మాటలు, అడల్ట్ బూతుల గురించి అందరికీ తెలిసిందే. అందరూ ఏవగించుకునేలా ఆ మాటలుంటాయి. సరయు అంటే అందరికీ ఓ హడల్. ఆమెను ఎవ్వరూ అంతగా ఇష్టపడేవారు కాదు. ఆమెకు విపరీతమైన నెగెటివిటీ ఉండేది. ఆదే ఆమెకు బిగ్ బాస్ ఇంట్లో దెబ్బ కొట్టేసింది. సరయు బిగ్ బాస్ ఐదో సీజన్‌లో అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. మొదటి వారంలోనే సరయు ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.అయితే మళ్లీ నాన్ స్టాప్ షోలోనూ సరయుకు అవకాశం వచ్చింది. అయితే ఈ ఓటీటీలో సరయు ఇంకెంత రచ్చ చేస్తుందో అని అనుకున్నారు.

కానీ సరయు మాత్రం తన మార్క్ చూపించుకోలేకపోయింది. ఎప్పుడూ ఏడుపు మొహంతోనే కనిపించేది. హమీద, అరియానా, అషూ ఇలా అందరితో వాగ్వాదానికి దిగుతూ వచ్చేది. ఇక ఒక గొడవ మాత్రం నానా రచ్చకు దారి తీసింది. అరియానా అన్న ఒక మాట సరయుని తెగ బాధపెట్టేసింది. నువ్ నడుస్తుంటే భూకంపం వచ్చినట్టుంది.. నాకు భయం వేస్తుంది అని తన భారీకాయం మీద కౌంటర్లు వేసింది.అది కాస్త కామెడీగానే అన్నట్టుగా సరయు సీరియస్ అయింది. చాలా బాధపడింది. ఈ విషయాన్ని నాగార్జున వద్ద కూడా ప్రస్థావించింది. తనను జీరో సైజ్ అని, చాలా బాగుంటావ్ అని, నడుము మీద కామెంట్లు చేస్తుందని నేను కూడా అన్నాను అని అరియానా కవర్ చేసేసుకుంది.

Sarayu Recalls Ariyana Body Shaming Comments In Bigg Boss Non Stop

Sarayu Recalls Ariyana Body Shaming Comments In Bigg Boss Non Stop

నేను పాజిటివ్‌గా అంటే నువ్ మాత్రం నెగెటివ్‌గా అంటున్నావ్ అని సరయు చెప్పుకొచ్చింది. అయితే సరయు బయటకు వచ్చింది. అరియానా చివరి వరకు ఉంది. మొన్న జరిగిన ఫినాలే ఎపిసోడ్‌లోనూ ఈ గొడవ మళ్లీ ప్రస్థావనకు వచ్చింది.అయితే అరియానాను మాత్రం సరయు ఇంకా క్షమించలేదని అర్థమైంది. అసలు అరియానాను తన మైండ్‌లోంచి డిలీట్ చేశానని, తనను పట్టించుకోవడం లేదని అరియానా గురించి సరయు చెప్పింది. అయితే తాజాగా సరయు ఓ పోస్ట్ చేసింది. ఒకరిని నల్లగా ఉన్నావ్, లావుగా ఉన్నావ్ అని అనొద్దంటూ ఆ పోస్ట్ చేసింది. అంటే సరయు మాత్రం ఇంకా అరియానా మాటలను మర్చిపోలేకపోతోందన్న మాట.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి