Sarkaru Vaari Paata : ఓటీటీలోకి అనవసరంగా తీసుకొచ్చారు.. రాంగ్ స్టెప్ వేసిన మహేష్ బాబు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sarkaru Vaari Paata : ఓటీటీలోకి అనవసరంగా తీసుకొచ్చారు.. రాంగ్ స్టెప్ వేసిన మహేష్ బాబు..?

 Authored By govind | The Telugu News | Updated on :4 June 2022,6:30 pm

Sarkaru Vaari Paata : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమాకు ఆయన కూడా ఓ నిర్మాత. అలాగే, ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన బయోపిక్ సినిమా మేజర్‌కు ఆయన నిర్మాణంలో భాగస్వామి. అయితే, మేజర్ సినిమా విషయంలో కరెక్ట్‌గా
ఆలోచించిన మహేశ్, సర్కారు వారి పాట సినిమా విషయంలో మాత్రం రాంగ్ స్టెప్ వేశారని చెప్పుకుంటున్నారు. గత నెల 12న సర్కారు వారి పాట సినిమా భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను జీఎంబీ, 14 రీల్స్
ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మించాయి.

అంటే, ఈ మూవీకి లాభాలొచ్చినా, నష్ఠాలు వచ్చినా ముగ్గురు భరించాలి. గత కొన్నేళ్ళుగా వరుస విజయాలను అందుకున్న మహేశ్‌కు సర్కారు వారి పాట సినిమాతో ఫ్లాప్ పడిందని డిసైడ్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజై ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకుంది. అయినా బ్రేకీవెన్‌కు ఆమడ
దూరంలో ఉండిపోయింది. ఓవరాల్‌గా 109.17 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఈ సినిమాకు అయిన బిజినెస్ 121 కోట్లు. దాన్ని బట్టి చూస్తే ఇంకా 11 కోట్లకు పైగానే రాబట్టాల్సి ఉంది. అందుకే, తాజాగా సర్కారు వారి పాట సినిమాలో మహేశ్ – కీర్తిలపై చిత్రీకరించిన ‘మురారి బావ’ సాంగ్‌ను యాడ్
చేశారు. ఇక్కడిదాకా బాగానే ఉంది.

Mahesh Babu took the wrong step Sarkaru Vaari Paata

Mahesh Babu took the wrong step Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paara : మహేష్ బాబు స్ట్రాటజీ ఏంటో ఆయనకే తెలియాలి.

దీని తర్వాతే మహేశ్ రాంగ్ స్టెప్ వేశారు. ‘మురారి బావా’.. పాటను థియేటర్స్‌లో యాడ్ చేసి ఒక్కరోజు కూడా గడవకముందే ఓటీటీలో పే ఫర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేశారు. ఇలా అనూహ్యంగా సర్కారు వారి పాట సినిమా ఓటీటీలో Rs.199 రూపాయలు కట్టి చూడటం అంటే అందరూ కలిసి ఇంట్లోనే
కూర్చొని చూస్తారు తప్ప ఇక థియేటర్స్‌కు వెళ్ళాల్సిన అవసరం ఏముందీ అనే ఆలోచనలోకి వచ్చేశారు. ఇంకొన్ని రోజులు థియేటర్స్‌లో సందడి చేసి బ్రేకీవెన్ రీచ్ అవ్వాలనే ‘మురారి బావా’ సాంగ్‌ను యాడ్ చేసింది. అలా కాకుండా అటు థియేటర్స్‌లో పాట యాడ్ చేసి ఇటు పే ఫర్ వ్యూ అంటే ఇక
థియేటర్స్‌కు ఎవరూ వెళ్ళరని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అంటే తన సినిమా విషయంలో తానే రాంగ్ స్టెప్ వేశారు మహేశ్. మరి మహేశ్ స్ట్రాటజీ ఏంటో ఆయనకే తెలియాలి.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది