Sarkaru Vaari Paata : లాంగ్ రన్‌లో లాస్ ఇన్ని కోట్లా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sarkaru Vaari Paata : లాంగ్ రన్‌లో లాస్ ఇన్ని కోట్లా..?

 Authored By govind | The Telugu News | Updated on :23 May 2022,12:00 pm

Sarkaru vaari paata: నిన్నా మొన్నటి వరకు సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది..బ్లాక్ బస్టర్..ఆర్ఆర్ఆర్ మూవీ రేంజ్‌లో తొలిరోజు వసూళ్ళు వచ్చాయని ..రెండవ రోజు ఇన్ని కోట్లు..ఇంకా బ్రేకీవెన్‌కు ఇన్ని కోట్లు వస్తే సరిపోతుందీ అంటూ జోరుగా మేకర్స్,మహేశ్ అభిమానులు షోషల్ మీడియాలో ఉత్తిత్తి ప్రచారం చేశారు. అప్పటికీ కొందరు నెటిజన్స్..ఈ మూవీ వసూళ్ల గురించి వస్తున్న వార్తలన్నీ అసత్యంఅని అంటూనే ఉన్నారు.ఎట్టకేలకు అవే నిజమయ్యేలా ఉన్నాయి.

ఇప్పుడు అసలు లెక్కలు బయటపడుతున్నాయట. గతకొన్నేళ్ళుగా సూపర్ స్టార్ మహేశ్ బాబు స్టామినాకు
తగ్గ కథలను ఎంచుకుంటూ భారీ హిట్స్ దక్కించుకున్నారు. అదే ఊపులో వంశీ పైడిపల్లి, పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు కథ చెప్పినా కూడా నో చెప్పి పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బలమనదే అయినా కూడాసన్నివేశాలు ఆకట్టుకోలేకపోయాయని మొదటిరోజు నుంచి చెబుతున్నారు ప్రేక్షకులు.

Sarkaru vaari paata How many crores is the loss in the long run

Sarkaru vaari paata How many crores is the loss in the long run

Sarkaru vaari paata: ఫైనల్‌గా ఎంత లాభం ఎంత నష్టం..?

కానీ, స్వయంగా నిర్మాతలే సర్కారు వారి పాట కలెక్సన్ ఇంతా అంతా అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ఇంకా రూ 30 కోట్లవరకు ఈ సినిమా రాబట్టాల్సి ఉందట. ఇప్పటికే కలెక్షన్స్ భారీగా డ్రాపయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాబు పాటకు భారీగా నష్టాలు రావచ్చునని
అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎంత లేదన్నా 25 నుంచి 30 కోట్ల వరకు నష్టాలు తప్పేలా లేదట.చూడాలి మరి ఫైనల్‌గా ఎంత లాభం ఎంత నష్టం అని లెక్క తేలుతుందో. అన్నట్టు ఇందులో వరుస ఫ్లాపులతో సతమవుతున్న కీర్తి సురేష్ హీరోయిన్‌గా
నటించిది. ఈ సినిమా కూడా అమ్మడికి హిట్ లేనట్టే.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది