Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట రికార్డుల మోత షురూ.. కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 రికార్డు బ్రెక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట రికార్డుల మోత షురూ.. కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 రికార్డు బ్రెక్

 Authored By mallesh | The Telugu News | Updated on :12 May 2022,1:05 pm

Sarkaru Vaari Paata : సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట రికార్డుల మోత మొద‌లైంది. టైటిల్ తోనే ఆక‌ట్టుకున్నఈ సినిమా రెండేళ్ల త‌ర్వాత మ‌హేశ్ న‌టించిన సినిమా కావ‌డంతో అభిమానులు ఆశ‌గా ఎదురుచూసారు. ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్, ట్రైల‌ర్ విప‌రీతంగా ఆక‌ట్టుకోవ‌డంతో మంచి హైప్ క్రియేట్ అయింది. ఇక థ‌మ‌న్ మ్యూజిక్ సినిమాకి మ‌రో హైలైట్ గా చెప్ప‌వ‌చ్చు. కాగా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన‌ ఈ మూవీ ఈ రోజు(మే 12) ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో గ్రాండ్ గా రిలీజ్ అయింది.

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా క‌ళావ‌తి పాత్ర‌లో నటించింది. ఇప్ప‌టికే క‌ళావ‌తి, మ‌మ మ‌హేశా సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేశాయి.మ‌హేష్ బాబు వ‌రుస హిట్ల‌తో ఫామ్ లో ఉండ‌డం. అన్ని ఎలిమెంట్స్ ఉన్న క‌మ‌ర్షియ‌ల్ సినిమా కావ‌డం.. ట్రైల‌ర్ విప‌రీతంగా ఆక‌ట్టుకోవ‌డం ఈ సినిమాకు క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. అలాగే సూప‌ర్ స్టార్ ఫ‌స్ట్ లుక్ నుంచి కూడా ఆక‌ట్టుకోవ‌డం..

Sarkaru Vaari Paata Record KGF Chapter 2 Record Break

Sarkaru Vaari Paata Record KGF Chapter 2 Record Break

పోకిరీ, దూకుడు వంటి సినిమాల‌ను త‌ల‌పిస్తుండ‌టంతో మంచి హైప్ వ‌చ్చింది. ఈ స‌నిమాలో మ‌హేశ్ బాబు మ‌రింత అందంగా క‌నిపించ‌గా స్మైలీ బ్యూటీ కీర్తి సురేష్ ఉండ‌ట‌తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. కాగా రెండు రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్ప‌టికే కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 ను అధిగ‌మించింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఫ‌స్ట్ డే ఆరు కోట్ల 60 ల‌క్ష‌లు రాబ‌ట్టింది. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ లో కూడా అదిరిపోయే టాక్ వ‌చ్చింది. బ్లాక్ బ‌స్ట‌ర్ దిశ‌గా దూసుకెళ్తోంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది