Watchman To 3 Govt Jobs : వాచ్ మెన్ గా ఉద్యోగం చేస్తూనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు…ఈ యువకుడి కథ వింటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Watchman To 3 Govt Jobs : వాచ్ మెన్ గా ఉద్యోగం చేస్తూనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు…ఈ యువకుడి కథ వింటే…!

Watchman To 3 Govt Jobs  : ప్రతి ఒక్కరి జీవితంలో సక్సెస్ అనేది అంత ఈజీగా అయితే రాదు. దానికోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్నిసార్లు ఫలితాలు సాధించలేం. అలా ప్రయత్నిస్తున్న సమయంలో అనేక రకాల అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ,విమర్శలు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ వాటికి బెదరకుండా ఒక్కొక్క మేటు ఎక్కి అనుకున్న గమ్యస్థానానికి చేరుకున్న వారే సక్సెస్ ను పొందగలుగుతారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ […]

 Authored By aruna | The Telugu News | Updated on :2 March 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Watchman To 3 Govt Jobs : వాచ్ మెన్ గా ఉద్యోగం చేస్తూనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు...ఈ యువకుడి కథ వింటే...!

Watchman To 3 Govt Jobs  : ప్రతి ఒక్కరి జీవితంలో సక్సెస్ అనేది అంత ఈజీగా అయితే రాదు. దానికోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్నిసార్లు ఫలితాలు సాధించలేం. అలా ప్రయత్నిస్తున్న సమయంలో అనేక రకాల అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ,విమర్శలు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ వాటికి బెదరకుండా ఒక్కొక్క మేటు ఎక్కి అనుకున్న గమ్యస్థానానికి చేరుకున్న వారే సక్సెస్ ను పొందగలుగుతారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎంతో కృషి పట్టుదల ఉండాలి.అయితే ఓ యువకుడు ఇప్పుడు ఇదే నిరూపించి చూపించాడు. ఓ యువకుడు ఒకవైపు వాచ్ మెన్ గా ఉద్యోగం చేస్తూనే ఈరోజు ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు. ఈ యువకుడు నేటితరం యువతకు ఎంతో ఆదర్శమని చెప్పాలి. మరి అంతటి సక్సెస్ సాధించిన ఆ యువకుడు రియల్ లైఫ్ స్టోరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోనకల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు తన ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు జన్నారంలోనే పూర్తి చేశాడు. అయితే ప్రవీణ్ తండ్రి పెద్ధులు మేస్త్రిగా పనిచేస్తుంటే తల్లి పోసమ్మ బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ ప్రవీణ్ ను చదివించారు. ఇక తన తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసిన ప్రవీణ్ ఎలాగైనా సరే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని నిశ్చయించుకున్నాడు.ఆ క్రమంలోనే నిరంతరం చదువుతూ కష్టపడి ఎంకం, బిఈడి, ఎంఈడి ఓయూ క్యాంపస్ లో చదువుకున్నాడు. ఇక అక్కడ ఖర్చుల నిమిత్తం తన తల్లిదండ్రులపై ఆధార పడకూడదనే ఉద్దేశంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎడ్యుకేషనల్ మల్టీమీడియా సెంటర్ లో రాత్రిపూట వాచ్ మెన్ గా పనిచేస్తూ ఉండేవాడు. అయితే ఇంత చదువు చదువుకొని ఇలా వాచ్ మెన్ గా పనిచేస్తున్నందుకు ప్రవీణ్ ఏ రోజు కూడా తనను తాను తక్కువగా చూసుకోలేదు. అలా రాత్రివేళ వాచ్ మెన్ గా పనిచేస్తూ పగటిపూట చదువుకొని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు.

ఈ నేపథ్యంలోనే తాజాగా 10 రోజుల వ్యవధిలోనే ప్రవీణ్ మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు. అయితే ఇటీవల తెలంగాణ గురుకుల విద్యాలయాల బోర్డు ప్రకటించిన ఫలితాల్లో ..టిజిటి, పిజిటి, జూనియర్ లెక్చరర్ విభాగాలలో ప్రవీణ్ ఉద్యోగాలు సాధించాడు.ఆయన ఆత్మవిశ్వాసం పట్టుదల శ్రమ ఫలించి ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఈ విధంగా ప్రవీణ్ ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శనీయంగా మారాడు అని చెప్పాలి. అందుకే సక్సెస్ కోసం మనం పరిగెత్తడం కాదు దానికి తగిన కృషి చేస్తే సక్సెస్ మన వెంట వస్తుందని అందరికీ నిరూపించి చూపించాడు ప్రవీణ్. ఇక ప్రవీణ్ ఉద్యోగాలు సాధించడం పట్ల ఈఎంఆర్సి డైరెక్టర్ మరియు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. మరి వాచ్ మెన్ గా ఉద్యోగం చేస్తూ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ప్రవీణ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది