Keerthy Suresh : దించకుండా కల్లుబాటిల్ తాగేసిన కీర్తి సురేష్.. రానా, నాని షాక్ వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Keerthy Suresh : దించకుండా కల్లుబాటిల్ తాగేసిన కీర్తి సురేష్.. రానా, నాని షాక్ వీడియో వైరల్..!!

Keerthy Suresh : నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా “దసరా”. తెలంగాణ సింగరేణి బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30వ తారీకు విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. తెలుగులో మాత్రమే కాదు కన్నడ, మలయాళం, హిందీ, తమిళంలో సినిమా విడుదల చేయనున్నారు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో హీరోయిన్ లతోపాటు […]

 Authored By sekhar | The Telugu News | Updated on :23 March 2023,1:00 pm

Keerthy Suresh : నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా “దసరా”. తెలంగాణ సింగరేణి బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30వ తారీకు విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. తెలుగులో మాత్రమే కాదు కన్నడ, మలయాళం, హిందీ, తమిళంలో సినిమా విడుదల చేయనున్నారు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో

See How Keerthy Suresh Drinking Full Bottle Infront Of Nani and Rana

See How Keerthy Suresh Drinking Full Bottle Infront Of Nani and Rana

హీరో హీరోయిన్ లతోపాటు దగ్గుబాటి రానా కూడా పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలో హిందీ ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించి ముంబైలో జరిగిన వేడుకలో హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన పనికి రానా, నానీలతో పాటు అక్కడున్న మీడియా ప్రతినిధులు యాంకర్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. విషయంలోకి వెళ్తే దసరా సినిమాల్లో కొన్ని సన్నివేశాలు మందేసి…

Rana Got Little Serious On Keerthy Suresh ???????? For Drinking Liquor For  Dasara Promotions | Nani Movie - YouTube

చేసిన సందర్భాలు ఉన్నాయని నాని తెలపడం జరిగింది. దసరా మూవీలో నాని బాటిల్ ఎత్తితే దించే ప్రసక్తి ఉండదంట. ఈ క్రమంలో ముంబైలో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో నాని, రానా లతో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ ముగ్గురు కల్లు బాటిల్ తాగటం జరిగింది. ఈ క్రమంలో రానా, నానిల కంటే హీరోయిన్ కీర్తి సురేష్ బాటిల్ దించకుండా తాగేసింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయిపోయారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది