Vikramarku Child Artist : విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vikramarku Child Artist : విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి..!

Vikramarku Child Artist : రాజమౌళి సినిమాల్లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం విక్రమార్కుడు. ఆ సినిమా గుర్తుకువస్తే చాలు అందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కచ్చితంగా చర్చకు వస్తుంది. ఎందరో మహా మహుల నటనతో పాటు చైల్డ్ ఆర్టిస్టులు కూడా తమదైన శైలితో ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. తక్కువ సినిమాలు చేసినప్పటికీ వారి మాటలు, చేష్టలతో ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే చైల్డ్ ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. లిటిల్ సోల్జర్స్ లో నటించిన కావ్య, […]

 Authored By aruna | The Telugu News | Updated on :9 August 2022,4:20 pm

Vikramarku Child Artist : రాజమౌళి సినిమాల్లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం విక్రమార్కుడు. ఆ సినిమా గుర్తుకువస్తే చాలు అందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కచ్చితంగా చర్చకు వస్తుంది. ఎందరో మహా మహుల నటనతో పాటు చైల్డ్ ఆర్టిస్టులు కూడా తమదైన శైలితో ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. తక్కువ సినిమాలు చేసినప్పటికీ వారి మాటలు, చేష్టలతో ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే చైల్డ్ ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. లిటిల్ సోల్జర్స్ లో నటించిన కావ్య, గంగోత్రి లో నటించిన మరో చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య, డాడీ చిత్రంలో నటించిన అనుష్క అలాంటి వారు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ జాబితాలోనే విక్రమార్కుడు ఫేమ్ నేహా తోట వచ్చింది.

Vikramarku Child Artist : ఈ నేహా ఏం చేస్తుందో తెలుసా

విక్రమార్కుడు సినిమాకు చైల్డ్ ఆర్టిస్ట్ కోసం రాజమౌళి ఆడిషన్స్ నిర్వహిస్తుంటే అందరూ పిల్లలు అల్లరి చేస్తున్నారట. అయితే నేహా మాత్రం ఒకచోట కామ్ గా కూర్చుందట. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర కూడా అలాగే ఉండడంతో రాజమౌళి వెంటనే ఆమెను సెలెక్ట్ చేశాడట. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తన అమాయకత్వంతో సినిమాలో ఆఫర్ కొట్టేసిన నేహా తర్వాత అదే నటనతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్ష సినిమాలో దయ్యం పట్టిన పిల్లగా నటించి అందరిని అలరించింది. రక్షా సినిమాలో నటించింది విక్రమార్కుడు నటించిన నేహా ఇద్దరు ఒకరేనా అన్న సందేహం ప్రేక్షకులకు కలిగింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు వచ్చినా వాటిని తిరస్కరించి పూర్తిగా స్టడీస్ పైనే కాన్సన్ట్రేషన్ చేసింది ఈ అమ్మాయి.

see how vikramarku child artist is now

see how vikramarku child artist is now

ప్రస్తుతం ఫ్లోరిడాలో బిజినెస్ మేనేజ్మెంట్ MBA చదువుతుంది ఈ చైల్డ్ ఆర్టిస్ట్. సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ గా ఉండటంతో సినిమాలో ఎందుకు నటించడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. స్టడీస్ పూర్తయ్యాక సినిమా అవకాశాలు వస్తే చేస్తానని, సినిమాల్లో చేయడానికి ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది ఆ చిన్నారి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ చర్చ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అమ్మాయి విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్టా అంటూ నెటిజన్లు అవాక్కవుతున్నారు. కమల్ హాసన్, రాశి, తరుణ్, బాలాదిత్య లాంటి వారు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ ప్రారంభించి ఇండస్ట్రీ గర్వించదగ్గ నటీ,నటుల అయ్యారు.

see how vikramarku child artist is now

see how vikramarku child artist is now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది