Home » Entertainment » Sekhar Kammula And Dhanush Movie Interesting Update
Entertainment

Sekhar Kammula : శేఖర్‌ కమ్ముల సినిమా ఏమైంది.. ఆ గుసగుసలు ఎంత వరకు నిజం?

Authored By
aruna
The Telugu News | Published on: August 23, 2022, 10:20 pm
Advertisement

Sekhar Kammula : సెన్షిబుల్ డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల సినిమా సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఆయన ఫిదా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని లవ్‌ స్టోరీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాగ చైతన్య మరియు సాయి పల్లవి జంటగా నటించిన లవ్‌ స్టోరీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా పై ఉన్న అంచనాలు అందుకుంది అంటూ టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన తదుపరి సినిమా విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. లవ్‌ స్టోరీ సినిమా విడుదలకు ముందు నుండే శేఖర్ కమ్ముల తదుపరి సినిమా తమిళ స్టార్‌ హీరో ధనుష్ తో అంటూ వార్తలు వచ్చాయి.. ఆ మధ్య అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

Advertisement

ధనుష్ తెలుగు లో శేఖర్‌ కమ్ముల సినిమా తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. ఏషియన్‌ మూవీస్‌ వారు సినిమా ను నిర్మించబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అంటూ గత కొన్ని రోజులుగా వచ్చిన వార్తలకు ఫుల్‌ స్టాప్ పడింది. గత కొన్ని రోజులుగా శేఖర్‌ కమ్ముల మరియు ధనుష్ ల కాంబో సినిమా క్యాన్సిల్‌ అయ్యింది అంటూ పుకార్లు షికార్లు చేయడం మొదలు అయ్యింది. శేఖర్ కమ్ముల సూచించిన కథ కు మరియు స్క్రీన్‌ ప్లే కి ధనుష్ మార్పులు చేర్పులు చెప్పాడట. ఆ మార్పులు చేర్పులు చేసేందుకు శేఖర్‌ కమ్ముల నో చెప్పడంతో సినిమా మొత్తానికి క్యాన్సిల్‌ అయ్యిందని అంటున్నారు.

Sekhar Kammula and dhanush movie interesting update

Advertisement

ధనుష్ ఆ సినిమా క్యాన్సిల్‌ చేసుకుని తెలుగు లో వెంకీ అట్లూరి దర్శకత్వం లో సార్ అనే సినిమా ను చేస్తున్నాడు. ఆ తర్వాత మరో తెలుగు సినిమా ను కూడా ధనుష్ చేయబోతున్నాడు. కాని శేఖర్ కమ్ముల దర్శకత్వం లో సినిమా మాత్రం లేనట్లే అంటున్నారు. ఒక వేళ శేఖర్ కమ్ముల అదే కథ తో ఒక తెలుగు సినిమా హీరో తో చేసేందుకు సిద్ధం అయితే పలువురు హీరోలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. మంచి దర్శకుడిగా పేరు ఉన్న శేఖర్ కమ్ముల తో సినిమా వదులుకున్న ధనుష్ దురదృష్టవంతుడు అంటూ శేఖర్ కమ్ముల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి