Sekhar Kammula : కుబేరని హాలీవుడ్ రేంజ్‌లో తీయాలని అనుకున్నాను.. శేఖర్ కమ్ముల కామెంట్స్
Sekhar Kammula : సాధారణంగా శేఖర్ కమ్ముల చాలా స్లో అండ్ స్టడీగా సాగుతుంటాయి. ఆయన సినిమాల్లో స్టార్ హీరోలు, హీరోయిన్లు కనిపించరు. భారీ ఎలివేషన్లు, యాక్షన్ సీక్వెన్సులు ఉండవు. అయితేనేం ఆయన సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. తొలిసారి తన కెరీర్ లో నే మొదటి సారి ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా తదితర స్టార్స్ తో కుబేర సినిమాను తెరకెక్కించారు శేఖర్.
Sekhar Kammula : కుబేరని హాలీవుడ్ రేంజ్‌లో తీయాలని అనుకున్నాను.. శేఖర్ కమ్ముల కామెంట్స్
పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు. మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే రిలీజ్ కు ముందు సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శుక్రవారం (జూన్ 20)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కుబేర మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.
సినిమా చూసిన వారందరూ శేఖర్ కమ్ముల టేకింగ్ ను తెగ మెచ్చుకుంటున్నారు. అలాగే ధనుష్, నాగార్జున, రష్మిక ల నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. కుబేరా అనేది ఒక సాధారణమైన సినిమా కాదు. .. మేము మొదటి నుంచి ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తీయాలని అనుకున్నాం, రియల్ లొకేషన్ లో తీయాలి అనుకున్నాం. ఇప్పటి వరకు నేను తీసిన సినిమా అన్నింట్లో కుబేర అనేది బెస్ట్ సినిమా అని చెప్పుకొచ్చారు శేఖర్ కమ్ముల.
AI Edge Gallery | ప్రపంచంలోనే అత్యున్నత టెక్ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ (Google), మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్…
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
This website uses cookies.