Home » Health » Health Benefits Of Watermelon 2
Health

Watermelon : పుచ్చకాయల సీజన్ పోయిందిగా.. వీటితో ఏం పని అనుకునేరు… ఖాళీ కడుపుతో తింటే… ఏడాది తింటూనే ఉంటారు…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 21, 2025, 3:00 pm
Advertisement

Watermelon : కొన్ని సీజనల్గా వచ్చే పండ్లను తింటే ఆరోగ్యకరమని ఆ సీజన్లో లభించే పండ్లను అప్పుడే తినడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు.కొందరితే, ఎప్పుడైనా తింటూ ఉంటారు. ఎండాకాలంలో వచ్చే ఈ పుచ్చకాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఇటీవల, ఎప్పుడంటే అప్పుడు పుచ్చకాయలు లభిస్తున్నాయి. అయితే నిపుణులు వేసవికాలంలో పుచ్చకాయని ఉదయం పరగడుపున తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మిగతా కాలంలో ఈ పుచ్చకాయ లభ్యమైతే అప్పుడు కూడా ఉదయాన్నే పరగడుపున తీసుకోవచ్చు. ఉదయం నిద్ర లేవగానే పరగడుపున ఈ పుచ్చకాయ తిన్నారంటే అలసట దూరమవుతుంది. మధ్యాహ్నం సమయానికి నిరసించేవారికి ఈ పుచ్చకాయ ఈ సమస్యను దూరం చేస్తుంది. ఈ కాయలో క్షారాగుణాలు, మన శరీరంలోని ఆమ్లత్వాన్ని తగ్గించి. పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. మన సమస్యలన్నీటిని దూరం చేయగలదు.

Advertisement

Watermelon : పుచ్చకాయల సీజన్ పోయిందిగా.. వీటితో ఏం పని అనుకునేరు… ఖాళీ కడుపుతో తింటే… ఏడాది తింటూనే ఉంటారు…?

సాధారణంగా మనం రాత్రి నిద్రించినప్పుడు శరీరంలో కొన్ని ప్రక్రియలు కారణంగా ఆమ్లాలు పేరుకు పోతాయి. ఇవి ఉదయం లేవగానే చాలా చిరాకును కలిగిస్తాయి. ఎసిడిటీ కూడా అనిపిస్తుంది. సమస్యను నివారించుటకు పుచ్చకాయ ఉదయాన్నే పరగడుపున తింటే మంచిదంటున్నారు నిపుణులు. దీనిలో ఉండే క్షార గుణాలు మన శరీరంలోని ఆమ్లత్వాన్ని తగ్గించి పీహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. దీనివల్ల ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు.

Advertisement

Watermelon గడుపున పుచ్చకాయతో ఆరోగ్య ప్రయోజనాలు

పుచ్చకాయలో సిట్రులిన్ ‘అనే పదార్థం రక్తనాళాలను సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. తద్వారా,శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. పుచ్చకాయలు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనిని పరిగడుపున తీసుకుంటే, శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను గ్రహించి, నీ ప్రకాశంవంతంగా మెరిసేలా చేస్తుంది. ఉదయాన్నే పరగడుపున పుచ్చకాయ తీసుకుంటే, దీనిలో ఉండే, నీరు, ఖనిజ లవణాలు మన మూత్రపిండాల పనితీరుపై మెరుగు చూపిస్తుంది.శరీరాన్ని సహజసిద్ధంగా శుభ్రపరచడానికి కూడా దోహదపడుతుందంటున్నారు నిపుణులు. పుచ్చకాయలో సహజంగా ఉండే ఎంజైములు మన జీర్ణ వ్యవస్థను ఉత్తేజం చేస్తాయి.పుచ్చకాయ తిన్న తర్వాత,అరగంట వరకు ఇతర ఏ ఆహారాలను తీసుకోకూడదు. అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అరగంట సమయం పూర్తయిన తర్వాత,పుచ్చకాయలు ఉండే ఎంజైములు తదుపరి ఆహారం కోసం సిద్ధం చేస్తుందని,వైద్య నిపుణులు తెలిపారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి