Sreemukhi – Sekhar Master : శేఖర్ మాస్టర్ పై శ్రీముఖి ముద్దుల వర్షం.. నాకు సంబంధం లేదు.. మాస్టర్ షాకింగ్ కామెంట్స్

Authored By aruna | The Telugu News | Published on: August 7, 2022, 9:20 pm

Sreemukhi – Sekhar Master : టాలీవుడ్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోనే శేఖర్ మాస్టర్ ఇప్పుడు టాప్ కొరియోగ్రఫర్. స్టార్ హీరోల పాటలకు ఆయన కొరియోగ్రఫీ అందించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ మాస్టర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. శ్రీముఖి గురించి, ఓ షోలో తను పెట్టిన ముద్దుల విషయాన్ని కూడా ఆయన ఈసందర్భంగా చెప్పుకొచ్చాడు.

ఓ వ్యక్తి కారణంగా తాను మోసపోయానని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే దారిలో ఓ ప్లేస్ తీసుకున్నానని, దాన్ని ఓ వ్యక్తి చెబితే తీసుకున్నానని చెప్పుకొచ్చాడు శేఖర్ మాస్టర్. దాని కోసం అప్పు చేసి మరీ తీసుకున్నానని, ఒక సంవత్సరం తర్వాత దాన్ని డబుల్ రేట్ కు అమ్మిస్తానని ఆ వ్యక్తి నమ్మబలికాడని, సంవత్సరం తర్వాత ఆ వ్యక్తి కొన్న ధరకు కూడా ఆ స్థలాన్ని అమ్మించలేదని, ప్రస్తుతం తన ప్లేస్ గురించి పట్టించుకోకుండా వదిలేశాడని శేఖర్ మాస్టర్ చెప్పాడు. ఆ వ్యక్తి చేతిలో తాను మోసపోయినట్టు తెలిపాడు శేఖర్ మాస్టర్.

Sekhar master comments on sreemukhi kisses

Sekhar master comments on sreemukhi kisses

Sreemukhi – Sekhar Master : శ్రీముఖికి ఏమైందో తనకు తెలియదన్న శేఖర్ మాస్టర్

ఓ షోలో శ్రీముఖి తనకు ముద్దులు పెట్టిన విషయంపై కూడా ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ స్పందించాడు. ఢీ షోలో తనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని చెప్పినదాన్ని, శేఖర్ మాస్టర్ కు అమ్మాయిలంటే పిచ్చి అన్నట్టుగా మార్చేశారన్నాడు. మొన్న జరిగిన షోలో శ్రీముఖికి ఏమైందో అర్థం కాలేదు. ఆ పాట రావడంతోనే తను నాకు ముద్దులు పెట్టింది. ఆమె ముద్దులు పెట్టడం వెనుక నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె ముద్దులు పెడితే నేను ఏం చేయను.. అని చెప్పుకొచ్చాడు శేఖర్ మాస్టర్.
ఢీ షోలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉండవు. అలాంటివి ఉండకుండా చూస్తాం. స్కిట్లలో కొంచెం మసాలా మిక్స్ చేస్తారు కానీ.. అంతగా మసాలా ఉండకుండా కంటెస్టెంట్లకు ముందే చెబుతాం.. అని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp