Senior Actor Sarath Babu : ఆసుపత్రి లో చావు బతుకుల మధ్య టాప్ నటుడు !
Senior Actor Sarath Babu : సీనియర్ యాక్టర్ శరత్ బాబు నిన్న అనారోగ్యానికి గురై హైదరాబాద్ AIG ఆసుపత్రులో జాయిన్ అవ్వడం జరిగింది. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అంతకుముందు ఆల్రెడీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అప్పట్లో బెంగళూరులో ట్రీట్ మెంట్ ఇప్పించారు. అయితే ఇప్పుడు గతంలో కంటే కాస్త సీరియస్ రావడంతో హైదరాబాద్ లో జాయిన్ చేయడం జరిగింది. ఏప్రిల్ 22వ తారీకు శనివారం… మధ్యాహ్నం హాస్పిటల్ లో జాయిన్ అవ్వగా… సాయంత్రానికి రికవరీ అయ్యారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
అయితే కొద్దిగా క్రిటికల్ గానే కండిషన్ ఉన్నట్లు కొద్దిరోజులు హాస్పిటల్ లోనే శరత్ బాబుని ఉంచాలని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలియజేసినట్లు సమాచారం. శ్వాసకి సంబంధించిన సమస్య కావడంతో చావు బతుకుల మధ్య పొజిషన్ అన్నట్టు పరిస్థితి ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మళ్లీ ఏ క్షణమైనా వ్యాధి తిరగబడే అవకాశం ఉందని.. హాస్పిటల్లోనే కొన్ని రోజులు శరత్ బాబునీ ఉంచాలని కోరాటం జరిగింది. దక్షిణ సినిమా రంగంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తనకంటూ సెక్రెటరీ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.
ముఖ్యంగా సహాయ నటుడిగా శరత్ బాబు మూడు నంది అవార్డుల అందుకున్నారు. 250కి పైగా చిత్రాలు చేయడం జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో నటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్ “లో కీలక పాత్ర కూడా పోషించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇంకా టెలివిజన్ రంగంలో సీరియల్స్ లో కూడా రాణించటం జరిగింది. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించిన శరత్ బాబు ఇండస్ట్రీలో టాప్ నటుడిగా ఎదిగారు. అటువంటి వ్యక్తి ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉండటంతో శరత్ బాబు ఆరోగ్యం పై అభిమానుల ఆందోళన చెందుతున్నారు.