Actress Lahari : కసిగా చేయమన్నారు.. అందుకే ఇలా రెచ్చిపోయిన బుల్లితెర నటి లహరి
Actress Lahari : బుల్లితెరపై ఓంకార్ చేసే షోలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ఓంకార్ ఇస్మార్ట్ జోడి, సిక్స్త్ సెన్స్ అంటూ షోలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇస్మార్ట్ జోడి సీజన్ 2 నడుస్తోంది. ఇందులో సీరియల్ సెలెబ్రిటీ రియల్ కపుల్స్‌తో ఆట ఆడిస్తున్నాడు. ఇందులో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లను కూడా వారి ఫ్యామిలీతో కలిసి ఆడిస్తున్నాడు ఓంకార్.
అలా ఈ సారి బాబా భాస్కర్, అమ్మ రాజశేఖర్, కౌశల్ ఫ్యామిలీలు కూడా ఆడుతున్నాయి. ఇక సీరియల్ నటీమణులు కూడా వారి వారి భర్తలతో ఆటలు ఆడుతున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెర నటి లహరి తన భర్తతో కలిసి ఈ షోలో పార్టిసిపేట్ చేసింది. అయితే ఈ వారం ప్రసారం కానున్న షోలో జోడిలు అదిరిపోయే పర్ఫామెన్స్‌లు చేసినట్టు కనిపిస్తోంది.

Sereial Actress Lahari In Ishmart Jodi 2
Actress Lahar : ఇస్మార్ట్ జోడిలో లహరి
ఇందులో లహరి భర్త మంచి రొమాంటిక్ యాంగిల్‌లో పర్ఫామెన్స్ చేశాడు. దీనిపై ఓంకార్ కౌంటర్లు వేశాడు. హరిశ్చంద్రుడు తనలోని మన్మథుడిని బయటకు తీసుకొచ్చారు అని సెటైర్ వేశాడు. మంచి కసితో డ్యాన్స్ చేయమని కొరియోగ్రఫర్ అన్నారు.. అందుకే ఇలా చేశాడు అని తన భర్త గురించి లహరి కామెంట్ చేసింది. మొత్తానికి లహరి మాత్రం డ్యాన్సుతో దుమ్ములేపేసింది.
