Shahrukh Khan – Prabhas : ‘ బాహుబలి ‘ సినిమా తర్వాత స్టార్ హీరోలంతా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ తమ క్రేజ్ ని పెంచుకుంటున్నారు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు అన్ని భాషలలో హీరోలు వీలైనంతవరకు తమ సినిమాను అన్నిచోట్ల విడుదల చేస్తూ ఉన్నారు. బాహుబలి సినిమా ఇండియన్ రూల్ ని పూర్తిగా మార్చేసింది అని చెప్పవచ్చు. దీంతో పాన్ ఇండియా సినిమాల ప్రహసనం మొదలైంది. దర్శక నిర్మాతలు కూడా కోట్లలో బడ్జెట్ పెట్టి సినిమాలను తెరకెక్కిస్తున్నారు. దీంతో హీరోల మార్కెట్ రేంజ్ కూడా పెరిగింది. దీంతో హీరో లు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
కేవలం రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా సినిమా ప్రాఫిట్ లో లాభాలు కూడా తీసుకునే విధంగా నిర్మాతలతో ఒప్పందం చేసుకొని డబ్బులు బాగా ఆర్టిస్తున్నారు. అయితే ఇండియాలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఒకరు గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారు. ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే ఇప్పుడు దీనిని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ బ్రేక్ చేశారని తెలుస్తుంది. ఇటీవల షారుఖ్ ఖాన్ ‘ పఠాన్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టింది.
అయితే పఠాన్ సినిమాకి షారుక్ ఖాన్ ఏకంగా 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రాఫిట్ లో 60 శాతం షారుక్ ఖాన్ కి ఇచ్చేందుకు నిర్మాత ఆదిత్య చోప్రా ముందుగానే కమిట్ అయ్యారు. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ పఠాన్ సినిమాకి రెమ్యూనరేషన్ తో పాటు సినిమా ప్రాఫిట్ షేర్ కూడా తీసుకున్నారు. దీంతో షారుక్ ఖాన్ కి 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఇండియాలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోగా షారుక్ ఖాన్ నిలిచాడు. మొన్నటి వరకు ఆ ప్లేస్లో టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ఉన్నాడు. ఇప్పుడు ప్రభాస్ రికార్డ్స్ బ్రేక్ చేసి ఆ ప్లేస్ లోకి షారుఖ్ ఖాన్ నెంబర్ వన్ పొజిషన్లోకి వచ్చాడు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.