Shakeela : షకీలాకి ఇంత అందమైన కూతురుందా.. ముంబై మోడల్స్‌ ఎందుకు ఇక.. వైర‌ల్ ఫిక్స్‌

Authored By vamana sai | The Telugu News | Updated on : 31 July 2021, 6:30 pm

Shakeela : ఎస్ తారగా ఒక దశలో మలయాళ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది షకీలా. ఆమె సినిమా వస్తుందంటే మలయాళ సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్, మమ్ముట్టి కూడా తమ సినిమాల రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసుకునేవారు. ఆ రేంజ్ లో వారికి చెక్ పెట్టి తన ఎస్ భరితమైన సినిమాలతో ఆకట్టుకుంది. ఆ సమయంలో షకీలా నుంచి వచ్చిన మలయాళ సినిమాలు తెలుగుతో పాటు ఇతర భాషలలోకి డబ్ అయ్యేవి. ఆమె సినిమా ఎక్కడైనా ఇదే రెస్పాన్స్. కెరీర్ ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడినప్పటికీ ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లో ఇదే జీవితం అని కొనసాగింది. ఆ సినిమాలతో స్టార్ హీరోయిన్స్ కి మించిన రేంజ్ అండ్ పాపులారిటీని సాధించింది.

shakeela-has-a-beautiful-daughter

shakeela-has-a-beautiful-daughter

ఇక షకీలాకి, ఆమె సినిమాలకి అభిమానులే కాదు ఇండస్ట్రీవారు కూడా సీక్రెట్ ఫ్యాన్స్ గా మారారు. తనతో మంచి రిలేషన్ కూడా మెయింటైన్ చేసిన వారున్నారంటే నమ్మడం కొంచెం కష్టం. అంతగా షకీలా పాపులర్ అయ్యారు. ఈ నేపథ్యంలో తనకి భారీగా కూడా రెమ్యునరేషన్ ఇచ్చారు. అలా క్రేజ్ ఉన్న షకీలా ఆ తర్వాత అలాంటి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. దానికి తోడు వచ్చిన అవకాశాలు అంతగా లేవు. దాంతో కొంత గ్యాప్ వచ్చింది. అయితే టాలీవుడ్ దర్శకుడు తేజ తను తీసిన సినిమాలలో ఆమెకి అవకాశం ఇచ్చాడు. సినిమా పరంగా ఆమె పాత్ర పరంగా మంచి పేరు వచ్చింది.

Shakeela : ఈ కార్యక్రమంలో తన కూమారుని అందరికీ పరిచయం చేశారు.

Shakeela

Shakeela

కానీ అందరూ తేజ మాదిరిగా ఆమెకి అవకాశాలివ్వడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. షకీలా ఉంటే సినిమా మీద అభిప్రాయాలు మారిపోతాయని భావించారు. ఇక షకీలాని ప్రేమించి మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తను నిజాయితీగా ఉన్నా కూడా అవతలి వ్యక్తి నిజాయితీగా లేక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో తనకి మిల్ల అనే ట్రాన్స్జెండర్ పరిచయం అయి ఆమెను కూతురుగా దత్తత తీసుకున్నారు. కాగా ఇటీవల కుక్ విత్ కోమలి పేరుతో ఓ కుకరీ షో ప్రసారమవనుండగా ఓ కంటెస్టెంట్ గా షకీలా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తన కూతురుని అందరికీ పరిచయం చేశారు. చాలా చక్కగా ఉందంటూ ఆమెని చూసిన అందరూ చెప్పుకుంటున్నారట.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి