Shakeela Eliminated : బిగ్ బాస్ హౌస్ నుంచి షకీలా ఔట్.. చివరకు అమ్మను పంపించేశారు.. నెక్స్ట్ ఎవరో?

Advertisement

Shakeela Eliminated : బిగ్ బాస్ తెలుగు ప్రస్తుతం మంచి జోరుమీదుంది. ప్రేక్షకులు అయితే కళ్లలో ఒత్తులు పెట్టుకొని మరీ బిగ్ బాస్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే చాలు.. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వీకెండ్ లో నాగార్జునతో జరిగే ఫన్ మామూలుగా ఉండటం లేదు. ఇక.. బిగ్ బాస్ తొలి వారంలో కిరణ్ రాథోడ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన విషయం తెలిసిందే. రెండో వారంలో ఏకంగా అమ్మనే పంపించేశారు. షకీలాను ఇంటికి పంపించేశారు ప్రేక్షకులు.

Advertisement
shakeela eliminated from bigg boss house season 7
shakeela

షకీలాను ఎందుకో ప్రేక్షకులు ఓన్ చేసుకోలేకపోయారు. అందుకే ఆమెను ఇంటికి పంపించేశారు. తొమ్మిది మంది నామినేషన్లలో ఉండగా మొదటగా సేవ్ అయింది శివాజీ. ఎందుకంటే.. ఆయనకు నాలుగు వారాల ఇమ్యూనిటీ వచ్చేసింది కాబట్టి ఆయన నామినేషన్స్ నుంచి బయటపడ్డారు. ఇక.. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున అమర్ దీప్ ను సేవ్ చేశాడు. ఇక మిగిలిన వారిలో షకీల్ వీక్ కంటెస్టెంట్. ఆమెనే ప్రేక్షకులు ఎలిమినేట్ చేశారు.అయితే.. షకీలా ఎలిమినేట్ కావడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆమె హౌస్ లో హడావుడి చేయడం లేదు. కంటెంట్ కోసం ఏది పడితే అది మాట్లాడటం లేదు. చాలా హుందాగా ఉంది ఆమె. నిజానికి బిగ్ బాస్ అనేది ఒక రియాల్టీ షో. అంతే కాదు వివాదాల షో. ఇక్కడ వివాదాలు చేయకుండా నేను చాలా మంచివాడిని అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తూ అందరితో మంచిగా ఉంటే నడవదు. ఇక్కడ హడావుడి చేయాలి. రచ్చ రచ్చ చేయాలి..

Advertisement

Shakeela Eliminated : షకీలా ఎలిమినేషన్ కు కారణాలు ఏంటి?

కానీ.. షకీలా అలా చేయలేదు. అందుకే ఆమెను ఇంటి నుంచి పంపించేశారు. షకీలా రెండో వారంలో ఎలిమినేట్ అయిందని ఈరోజు ప్రోమోతోనే తేలిపోయింది. ఆ ప్రోమోలో చూసినట్టుగా షకీలా ఎలిమినేట్ కాగానే హౌస్ మెట్స్ అందరూ చాలా షాక్ కు గురయ్యారు. అందరూ ఆశ్చర్యపోయారు. గుక్కపెట్టి ఏడ్చారు. ఇక మూడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియదు కానీ.. గౌతమ్ కృష్ణ, శుభశ్రీ, తేజ మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement
Advertisement