Shalini Pandey : బీచ్ లో ఎద అందాల‌తో షాలినీ పాండే ర‌చ్చ.. మామూలుగా లేదుగా.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shalini Pandey : బీచ్ లో ఎద అందాల‌తో షాలినీ పాండే ర‌చ్చ.. మామూలుగా లేదుగా..

 Authored By prabhas | The Telugu News | Updated on :7 August 2022,12:20 pm

Shalini Pandey : అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.. ఈ ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల‌కు తెగ న‌చ్చేసింది. విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఎంత‌గా ఆక‌ట్టుకుందో అంద‌రికీ తెలిసిందే. యుత్ ఎక్కువ‌గా క‌నెక్ట్ అయిన ఈ సినిమాతో విజ‌య్ స్టార్ అయిపోయాడు. ఇక ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి బాలీవుడ్ లో కూడా సినిమా తీసి స‌క్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ప్ర‌భాస్ తో సినిమా తీసే చాన్స్ కొట్టేశాడు. ఈ సినిమాతో న‌టుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఈ మూవీలో హీరోయిన్ ప్రీతి పాత్రలో నటించిన షాలినీ పాండే కూడా బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. కానీ ఆ క్రేజ్ ను ఈమె క్యాష్ చేసుకోలేకపోయింది ఆ తర్వాత ఈమె నటించిన ఏ సినిమాలోనూ ఆక‌ట్టుకోలేక‌పోయింది.ఇక మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒక్కటే, నిశ్శబ్దం వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఈ సినిమాలు ఏవీ షాలినీకి కలిసిరాలేదు. తెలుగులో అయితే అవకాశాలు త‌గ్గిపోయాయి. ఇక బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అవ‌కాశాలు రాబ‌ట్టుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఫిట్నెస్ పై బాగా శ్రద్ధ పెట్టింది.

Shalini Pandey latest video viral on instagram

Shalini Pandey latest video viral on instagram

బొద్దుగా ముద్దుగా ఉండే షాలినీ స‌న్న‌గా మారిపోయింది.ఇక ఫొటో షూట్ చేస్తూ నెటిజ‌న్ల‌కు అందాల విందు వ‌డ్డిస్తోంది. న‌డుము ఎద అందాల‌ను చూపిస్తూ క‌ట్టిప‌డేస్తోంది. ప్ర‌స్తుతం మాల్దీవ్స్ లో వెకేష‌న్ లో ఎంజాయ్ చేస్తున్న షాలినీ బీచ్ లో అందాల ట్రీట్ ఇస్తోంది. బీచ్ లో న‌డుస్తూ ఎద అందాల‌తో క‌ట్టిప‌డేస్తోంది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ మ‌తిపోగొడ‌తోంది. సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో నెటిజ‌న్లు బ్యూటిఫుల్.. నైస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది