Shanmukh : ఆ తేడా కూడా తెలీదా?.. సిరి పరువు తీసిన షన్ను
Shanmukh : బిగ్ బాస్ ఇంట్లో నిబ్బ నిబ్బి బ్యాచ్ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకున్నారు సిరి, షణ్ముణ్. షన్ను, సిరిలు చేసే చేష్టలు అలానే ఉంటాయి. ఇంకా ఎదగని వయసు, మనసుల్లా ప్రవర్తిస్తుంటారు. సిరి అయితే మరీ బరితెగించినట్టు ప్రవర్తిస్తుంటుంది. లేస్తే చాలు హగ్గు అంటుంది. పడుకున్నా హగ్గులతోనే చంపేస్తుంది. షన్ను, సిరిలు కలిసి హగ్గుల మీద హగ్గులిచ్చికుంటూ అడల్ట్ షోగా మార్చేస్తున్నారు.
సిరి తన ఎమోషన్స్‌ను ఆపుకోలేకపోతోన్నట్టు కనిపిస్తుంది. మాటిమాటికి షన్నుని సారీ చెప్పమని అనడం, సారి చెప్పాక ఓ మాంచి టైట్ హగ్ ఇస్తుంటుంది సిరి. షన్ను మీద పడుకోవడం, పడిపోవడం తప్పా సిరికి మరొక్కటి తెలియదు. తనకు బుర్ర లేదని నిన్నటి ఎపిసోడ్‌తో అర్థమైంది. తన తెలివి నిజంగా నిబ్బిలానే ఉందని నిరూపించింది.

Shanmukh Humiliates Siri In Finale Tickett Task In Bigg Boss 5 Telugu
Shanmukh : సిరి ఇజ్జత్ తీసిన షన్ను
నిన్న బిగ్ బాస్ ఫోకస్ అనే ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో సిరి తన తెలివిని ప్రపంచానికి చూపించింది. పులి గాండ్రించిన సౌండ్ వినిపిస్తే.. అది గురక అని రాసేసింది. ఇక హెలి కాప్టర్ సౌండ్‌ను ట్రాక్టర్ అంటూ రాసింది. సిరి తెలివిని చూసి షన్ను పకపకా నవ్వేశాడు. కనీసం అది కూడా తెలీదా? గురకకు పులి గాండ్రించిన సౌండ్‌కు తేడా తెలియదా?.. హెలికాప్టర్ సౌండ్‌ను ట్రాక్టర్ అని రాస్తావా? అని సిరి పరువుతీసేశాడు.