Bigg Boss 5 Telugu : షన్ను పక్కలో పడుకున్న సిరి.. యాంకర్ రవి సెటైర్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss 5 Telugu : షన్ను పక్కలో పడుకున్న సిరి.. యాంకర్ రవి సెటైర్లు

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో సిరి, షన్నుల కథ వేరేలా ఉంటోంది ఈ మధ్య. ఈ ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమే అయినా కూడా హద్దులు దాటుతోన్నట్టు కనిపిస్తోంది. నిన్నటి ఎపిసోడ్‌లో ఈ ఇద్దరి వ్యవహారం హద్దులు దాటింది. రాత్రి షన్ను, సిరి, జెస్సీల కలిసి పడుకున్నారు. ఇక షన్ను మధ్యలో ఉండటంతో ఇటు పక్క సిరి అదుముకుని పడుకుంది. మొత్తానికి ఇలా త్రిమూర్తులు ఒకే చోట పడుకోవడంతో రవి కౌంటర్ల […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :29 October 2021,4:20 pm

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో సిరి, షన్నుల కథ వేరేలా ఉంటోంది ఈ మధ్య. ఈ ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమే అయినా కూడా హద్దులు దాటుతోన్నట్టు కనిపిస్తోంది. నిన్నటి ఎపిసోడ్‌లో ఈ ఇద్దరి వ్యవహారం హద్దులు దాటింది. రాత్రి షన్ను, సిరి, జెస్సీల కలిసి పడుకున్నారు. ఇక షన్ను మధ్యలో ఉండటంతో ఇటు పక్క సిరి అదుముకుని పడుకుంది. మొత్తానికి ఇలా త్రిమూర్తులు ఒకే చోట పడుకోవడంతో రవి కౌంటర్ల మీద కౌంటర్లు వేసేశాడు. అర్దరాత్రి కామెడీ చేశాడు.

Shannu Siri Sleep Aside In Bigg Boss 5 Telugu

Shannu Siri Sleep Aside In Bigg Boss 5 Telugu

బ్రహ్మ దర్శనం జరుగుతోందని, వారి కాళ్లు మొక్కేశాడు. తీర్దప్రసాదాలు పెట్టాలి కదా? అంటూ పక్కనే ఉన్న పళ్లను తీసి వారి మీదకు విసిరాడు. మొత్తానికి వారు కూడా దాన్ని బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు. దుప్పటి లేపి వారి కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అలా మొత్తానికి రవి మాత్రం సిరి, షన్నును ఆడేసుకున్నాడు. అర్దరాత్రి ఈ హంగామాను అందరూ బాగానే ఎంజాయ్ చేశారు. అయితే ఇంకో ఘటన కూడా జరిగింది.

Bigg Boss 5 Telugu ఒకే బెడ్డుపై సిరి షన్ను

Siri And Shannu Fights Each Other In Bigg Boss 5 Telugu

Siri And Shannu Fights Each Other In Bigg Boss 5 Telugu

నిన్నటి ఎపిసోడ్‌లో సిరి ఉన్నట్టుండి.. షన్నుకు ముద్దు పెట్టేసి వెళ్లిపోయింది. అలా మోజ్ రూంలో షాక్అయిన షన్ను.. బెడ్రూం నుంచి ఇంటి సభ్యులు చూసి నవ్వుకున్నారు.సిరి ముద్దు పెట్టి వెళ్లిన విషయం ఎవ్వరికీ తెలియదు. ఆ ముద్దు హ్యాంగవుట్‌లో ఉన్న షన్ను.. సిరి వైపు చూస్తుండిపోయాడు. సిరినే షన్ను చూస్తున్నాడు.. సిరి అంటే ఇష్టం అంటూ రవి, యానీ మాస్టర్ మాట్లాడుకున్నారు. అవన్నీ వింటూ సిరి సైలెంట్‌గా ఉంది. కానీ ముద్దు పెట్టి వచ్చాను అందుకే అలా చూస్తున్నాడనే విషయం మాత్రం చెప్పలేదు.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది