Anchor Lasya : ఏంటి యాంకర్ లాస్య ఆ హీరోతో ప్రేమాయణం సాగించిందా? ఇన్నాళ్లకి బయటపడ్డ నిజం..!
Anchor Lasya : యాంకర్ లాస్య గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చీమ ఏనుగు జోక్స్‌తో ఫుల్ పాపులర్ అయిన లాస్య పలు వ్యక్తిగత కారణాల వల్ల యాంకరింగ్‌కు దూరమై ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో అడుగుపెట్టి అలరించింది. యాంకర్ రవి, లాస్య జోడికి మాములు రెస్పాన్స్ రాలేదు. యాంకరింగ్ లో ఎవరు తెచ్చుకోనంత గుర్తింపును యాంకర్ లాస్య-రవి జోడీ సంపాదించుకుంది అంటే అతిశయోక్తి కాదు. బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ లో […]
ప్రధానాంశాలు:
Anchor Lasya : ఏంటి యాంకర్ లాస్య ఆ హీరోతో ప్రేమాయణం సాగించిందా? ఇన్నాళ్లకి బయటపడ్డ నిజం..!
Anchor Lasya : యాంకర్ లాస్య గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చీమ ఏనుగు జోక్స్‌తో ఫుల్ పాపులర్ అయిన లాస్య పలు వ్యక్తిగత కారణాల వల్ల యాంకరింగ్‌కు దూరమై ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో అడుగుపెట్టి అలరించింది. యాంకర్ రవి, లాస్య జోడికి మాములు రెస్పాన్స్ రాలేదు. యాంకరింగ్ లో ఎవరు తెచ్చుకోనంత గుర్తింపును యాంకర్ లాస్య-రవి జోడీ సంపాదించుకుంది అంటే అతిశయోక్తి కాదు. బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ లో ముందుగా అందరి దృష్టిని ఆకర్షించిన లాస్య తర్వాత ఆ జోరుని కొనసాగించడంలో విఫలమైంది. అయితే లాస్య.. రాజ్ తరుణ్‌తో ఎఫైర్‌కి సంబంధించి ఒకప్పుడు ఎంత ప్రచారం జరిగిందో మనం చూశాం.
Anchor Lasya : సీక్రెట్ ఎఫైర్‌పై ఓపెన్
ఆ రూమర్స్‌పై లాస్య, రాజ్ తరుణ్ కూడా స్పందించారు. అయితే ఆ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. లాస్యతో పెళ్లి రూమర్ అనేది పూర్తిగా అవాస్తవమని అన్నాడు. లాస్యతో పెళ్లి అనే రూమర్ బయటికి వచ్చినపుడు తాను ఎంత ఇబ్బంది పడిందీ వివరించాడు. ఆ సమయంలో తన స్నేహితులు కూడా ఈ రూమర్ నిజమని నమ్మి.. తనకు ఫోన్ చేసినట్లు రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. లాస్యతో లేచిపోయి వస్తే పెళ్లికి తాము సాయం చేస్తామని కూడా కొందరు స్నేహితులు ఫోన్ చేశారని పేర్కొన్నాడు. ఈ వార్త అబద్ధమని అందరికి అర్ధమయ్యేలా చెప్పడానికి చాలా ఇబ్బంది అయిందని రాజ్ తరుణ్ అన్నాడు. ఈ వార్త నిప్పు లేకుండా వచ్చిన పొగ లాంటిదని రాజ్ తరుణ్ తెలియజేశాడు.
లాస్యను తాను ఒక్కసారి మాత్రమే.. ‘కుమారి 21 ఎఫ్’ ఆడియో వేడుకలో కలిసినట్టు రాజ్ తరుణ్ పేర్కొన్నాడు. ఆమె నాకు స్నేహితురాలు కాదు, పెద్ద పరిచయం కూడా లేదు. కేవలం వేడుకలో తీసిన సెల్ఫీనే ఈ ప్రచారానికి కారణమైందని రాజ్ తరుణ్ అన్నాడు. మరోవైపు లాస్య కూడా దీనిపై వివరణ ఇచ్చింది. నేను రాజ్ తరుణ్ తో ఎప్పుడూ కలిసి పని చేయలేదు. నేను ఆడియో వేడుకలకు యాంకరింగ్ చేస్తున్నప్పుడు చాలామంది హీరోల్ని కలిశా. మరి రాజ్ తరుణ్ తోనే ఎందుకు లింక్ పెట్టారో అర్థం కాలేదు. ఒక ఆడియో వేడుకలో సెల్ఫీ తీసుకున్నప్పుడు ఫొటోలో రాజ్ తరుణ్ తో పాటు నేను.. సింగర్ నోయల్ కూడా ఉన్నాడు. ఐతే ఆ ఫొటోలో నోయల్ ను కట్ చేసి.. మా ఇద్దరిది ఫొటో పెట్టి రూమర్ పుట్టించారు. ఆ రోజు రాజ్ తరుణ్ తో సెల్ఫీ తీసుకోవడమే తప్పయిందని అనుకున్నా అంటూ లాస్య పేర్కొంది.