Devara 2 : దేవర 2 ను అభిమానులు మరచిపోవాల్సిందేనా..?
Devara 2 Cancelled : ఎన్టీఆర్ అభిమానులను నిరాశపరిచే ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ కు కొనసాగింపుగా ప్లాన్ చేసిన పార్ట్-2 ప్రాజెక్ట్ నిలిచిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్టుల కోసం ఇతర దర్శకులతో ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల నుంచి వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ చిత్రం, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో సినిమా చేయటానికి ఎన్టీఆర్ సుముఖత వ్యక్తం చేయడంతో ‘దేవర-2’ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం కష్టమేనని తెలుస్తోంది.

devara-2
మొత్తానికి ‘దేవర’ పార్ట్-2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణంలో పార్ట్-2 రద్దయిందన్న వార్త వారికి కొంత నిరాశ కలిగించింది. అయితే ఎన్టీఆర్ వరుసగా స్టార్ డైరెక్టర్ల చిత్రాల్లో నటించబోతున్నాడనే వార్త వారికి కొంత ఊరటనిస్తోంది. కొరటాల శివ కూడా నాగచైతన్యతో కలిసి కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం ద్వారా అభిమానులకు మరింత వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. సినిమా రంగంలో ఇటువంటి మార్పులు సహజమే అయినప్పటికీ, ఈ నిర్ణయం వెనుక గల పూర్తి కారణాలు అధికారికంగా వెల్లడైతే మరింత స్పష్టత వస్తుంది.