
Shraddha Das Sings Song For Jabardasth Praveen In Extra Jabardasth
Jabardasth Praveen : బుల్లితెరపై ఈ మధ్య కమెడియన్ ప్రవీణ్ బాగానే ఫేమస్ అవుతున్నాడు. పటాస్ షోలో కనిపించి, పటాస్ ప్రవీణ్‌గా పేరు సంపాదించుకున్నాడు. ఫైమా లవర్‌గానూ ప్రవీణ్‌కు పేరుంది. ఈ ఇద్దరి ప్రేమ కథ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఫైమాకు కరోనా వచ్చిన సమయంలోనూ ప్రవీణ్ పక్కనే ఉన్నాడట. అన్ని సేవలూ చేశాడట. మొత్తానికి వీరి ప్రేమ కథ మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటుంది. ఫైమాకు ఎన్ని సార్లు ప్రపోజ్ చేసినా కూడా రిప్లై ఇవ్వదని ప్రవీణ్ చెబుతుంటాడు.అలా మొత్తానికి వీరి ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి అందరికీ తెలిసిందే.
అయితే ఆన్ స్క్రీన్ మీద మాత్రం ఎక్కువగా కలిసి కనిపించరు. ఫైమా చేసే స్కిట్లలో ప్రవీణ్ ఎక్కువగా కనిపించడు. అయినా కూడా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా కొన్ని షోల్లో ప్రవీణ్ తన మార్క్ వేస్తున్నాడు. తాజాగా ప్రవీణ్ కోసం శ్రద్దా దాస్ ఓ పాట పాడేసింది. మహేష్ బాబు కృతి సనన్ కాంబోలో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాలోని గోవా సాంగ్‌ను పాడేసింది. ఓ గంట బీచుకెడదామా? ఓ గంట ఫిష్ పడదామా? అంటూ ఇలా ప్రవీణ్ కోసం పాట పాడేసింది శ్రద్దా దాస్.దీంతో ప్రవీణ్ గాల్లో తేలిపోయాడు. ఇక అంతటితో ఆగకుండా.. శ్రద్దా దాస్ దగ్గరకు వచ్చాడు ప్రవీణ్. ఆమెను స్టేజ్ మీదకు తీసుకెళ్లాడు.
Shraddha Das Sings Song For Jabardasth Praveen In Extra Jabardasth
ఆమెతో కలిసి స్టెప్పులు వేశాడు. ఇక అంతా అయిపోయిన తరువాత.. గోవాకు మనం ఎప్పుడు వెళ్దాం అంటూ అందరి ముందే అడిగేశాడు. దీంతో శ్రద్దా దాస్ ఒక్కసారిగా అవాక్కయింది. మొత్తానికి ప్రవీణ్ మాత్రం మామూలోడు. హీరోయిన్ తన కోసం పాట పాడటమే ఎక్కువ అనుకుంటే.. స్టేజ్ మీద రొమాంటిక్ స్టెప్పులు కూడా వేసింది. అంతటితో ఆగకుండా.. గోవా ట్రిప్ గురించి అడిగేశాడు.మొత్తానికి పూర్ణ స్థానంలో శ్రద్దా దాస్ వచ్చింది. జడ్జ్‌గా ఇంద్రజతో పాటు కనిపించింది. ఆమె పూర్తి స్థాయిలో వస్తుందా?లేదా ఇలా గెస్టుగా ఒకటి రెండు ఎపిసోడ్‌ల వరకే పరిమితమవుతుందా? అన్నది చూడాలి. మనో ఇకపై ఈ షోలో కనిపించకపోవచ్చనిపిస్తోంది.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.