Home » Entertainment » Shri Reddy Comments On Hema And Pragati
Entertainment

Sri Reddy : హేమ, ప్రగతి బట్టలపై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్..

Authored By
mallesh
The Telugu News | Published on: October 15, 2021, 8:05 am
Advertisement

Sri Reddy : క్యాస్టింగ్ కౌచ్ అనే అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో పెద్ద దుమారమే రేపింది శ్రీరెడ్డి. వివాదాలకు కేరాఫ్‌గా ఉంటూ తరచూ పలు విమర్శలు చేస్తుంటుంది శ్రీరెడ్డి. సోషల్ మీడియా వేదికగా ఫుల్ యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ (మా) ఎలక్షన్స్ గురించి పలు కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎలక్షన్స్‌లో పాల్గొన్న ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులపై శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది. సేవే పరమార్థం అయినపుడు పదవి ఇంకొకరికి వెళ్లినపుడు వారు చేసే సేవలను చూడాలని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులకు చెప్పింది.

Advertisement

shri reddy comments on hema and pragati

మా ఎన్నికలు రోజున నటి హేమ, ప్రగతి తీరును తప్పుబట్టింది. హేమ తన ఒంటి మీదున్న బట్టలను పట్టించుకోలేదని దారుణ వ్యాఖ్యలు చేసింది. ఇకపోతే పోలింగ్ సందర్భంగా మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు ఏం చేస్తున్నారో చూసేందుకుగాను ప్రగతి ఎగురుతూ గెంతుతూ వచ్చిందని, ఆ సందర్భంలో ప్రగతి చీర ఎక్కడికి లేచింది..చీరలు ఎక్కడికి ఎగిరినవో చూసుకోవాలని హితవు పలికింది. పదవిపైన ఇంత వ్యామోహం ఎందుకని అడిగింది.

Advertisement

Sri Reddy : చీర ఎక్కడికి లేచిందో చూసుకో అని ప్రగతిపై కామెంట్ చేసిన శ్రీరెడ్డి..

shri reddy comments on hema and pragati

తాను అప్పట్లో చేసిన పనులను పబ్లిసిటీ స్టంట్స్ అని కొట్టిపారేసిన వారు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు చేస్తుందేంటో గుర్తించాలని కోరింది. మొత్తంగా శ్రీరెడ్డి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలే చేసింది. ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులను యాజ్ యూజ్యువల్‌గా విమర్శించింది. ప్రకాశ్ రాజ్ వెనుక మెగా ఫ్యామిలీ ఉందని అందరికీ తెలిసిపోయిందని వివరించింది. మెగా బ్రదర్ నాగబాబు, పవన్ కల్యాణ్ వల్లే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన సభ్యులు రిజైన్ చేస్తున్నారని పేర్కొంది. ఇకపోతే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఏడ్చిన సందర్భాన్ని తప్పుబట్టింది. ఈ ఏడ్పులు, పెడబొబ్బలు ఏంటని అడిగింది శ్రీరెడ్డి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి