Shriya Saran : బేబి బంప్‌తో దర్శనమిచ్చిన శ్రియ.. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఫొటోలు
Shriya Saran: ఒకప్పుడు తెలుగులో తెగ రచ్చ చేసిన అందాల ముద్దుగుమ్మ శ్రియ. ఈ అమ్మడు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి పని చేసింది. శ్రియ తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంది. . అందం, అందుకు తగ్గ అభినయం కనబర్చి ఎందరో అభిమానులను కూడగట్టుకున్న ఈ బ్యూటీ 2018 సంవత్సరంలో ఆండ్రీ కోస్చీవ్‌ని పెళ్ళాడి సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. కాకపోతే సోషల్ మీడియాలో వేదికగా మాత్రం అభిమానులతో టచ్‌లో ఉంటూ నెట్టింట మంట పుట్టించే రొమాంటిక్ అప్‌డేట్స్ షేర్ చేస్తోంది.
రీసెంట్‌గా శ్రియ ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించింది.కొద్ది రోజుల క్రితం ఆండ్రూ కొశ్చీవ్‌లు తల్లిదండ్రులు అయ్యారు.. శ్రియాకు బిడ్డ పుట్టింది అనే విషయాలు అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాయి. శ్రియా, ఆండ్రూలు ఆ విషయాన్ని ప్రకటించేంత వరకు ఎవ్వరికీ తెలియదు. సడెన్‌గా తమ పాపను చూపించారు. రాధ అంటూ పరిచయం చేశారు. తనే మా పాప అని కొన్ని ఫోటోలను చూపించారు. శ్రియ గర్భంతో ఉన్న ఫోటోలు, లాక్డౌన్‌లో గర్భందాల్చిందంటూ చెప్పేశాడు ఆండ్రూ. తమ గారాల పట్టి రాధ పుట్టి ఏడాది అవుతోందంటూ శ్రియ ఎమోషనల్ అయ్యారు.. తమ పాప పుట్టిన తేది, టైం చెబుతూ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు శ్రియా.
Shriya Saran : శ్రియ న్యూ లైఫ్..
తాజాగా శ్రియ బేబి బంప్‌తో దిగిన ఫొటో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఇందులో శ్రియ స్టన్నింగ్ లుక్స్‌లో మెరుస్తూ మెస్మరైజ్ చేస్తుంది. బేబి బంప్ చూపిస్తూ తెగ నవ్వులు చిందిస్తుంది. శ్రియని చూసి కుర్రకారు క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. తన మాతృత్వం గురించి శ్రియ మాట్లాడగా.. ‘‘2020 మొత్తం ప్రపంచాన్ని తలకిందులు చేసింది. కరోనా వ్యాప్తి కారణంగా అంతా సంవత్సరం పాటు క్వారంటైన్‌లో వెళ్లిగా.. మా జీవితంలో మాత్రం ఓ అద్భుతం జరిగింది. దేవుడు మాకు ఒక ఏంజిల్ లాంటి చిన్నారిని ప్రసాదించాడు. అందుకు ఆయనకు రుణపడి ఉంటాను. ఈ చిన్నారి రాకతో మా జీవితంలో ఓ అద్భుతం జరిగింది’ అంటూ ఓ వీడియోని షేర్ చేసింది.