Shriya Saran : శ్రీయ ఐటం సాంగ్.. అయ్య బాబోయ్ ఈసారి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంద.. ఏ సినిమాలో తెలుసా..?
ప్రధానాంశాలు:
Shreya Item Song : శ్రీయ ఐటం సాంగ్.. అయ్య బాబోయ్ ఈసారి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంద.. ఏ సినిమాలో తెలుసా..?
Shriya Saran: హనుమాన్ తో పాన్ ఇండియా హిట్ అందుకుని నేషనల్ లెవెల్ లో సత్తా చాటిన యువ హీరో తేజా సజ్జా తన నెక్స్ట్ సినిమా మిరాయ్ తో నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేశాడు. ఈగల్ తో టార్గెట్ మిస్ అవ్వగా మిరాయ్ తో ఎలాగైనా పాన్ ఇండియా హిట్ కొట్టాలని చూస్తున్నాడు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని. అతని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మిరాయ్ సినిమాలో మంచు మనోజ్ కూడా నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఆమధ్య వచ్చిన గ్లింప్స్ అదిరిపోయాయి.
ఇక ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సినిమాలో సీనియర్ హీరోయిన్ శ్రీయ శరణ్ ఒక స్పెషల్ సాంగ్ రాబోతుంది. సినిమాలో ఈ సాంగ్ సంథింగ్ స్పెషల్ గా ఉంటుందట. ఈమధ్య సినిమాలు తగ్గినా సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో అదరగొడుతున్న శ్రీయ శరణ్ ఇప్పటికే సూర్య 44లో ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుందని టాక్.
Shriya Saran శ్రీయ గ్లామర్ డోస్..
ఇప్పుడు తేజా సజ్జ సినిమాలో కూడా అమ్మడు ఒక స్పెషల్ ఐటం సాంగ్ చేస్తుందట. ఈ సాంగ్ లో శ్రీయ గ్లామర్ డోస్ ఒక రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. శ్రీయ శరణ్ చేయబోతున్న ఈ సాంగ్ గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. పెళ్లై ఒక పాప ఉన్నా తన లుక్ లో ఏమాత్రం తేడా రాకుండా జాగ్రత్త పడిన శ్రీయ రాబోతున్న రెండు ఐటం సాంగ్స్ తో రచ్చ రచ్చ చేస్తుందని తెలుస్తుంది.
శ్రీయ శరణ్ మళ్లీ కెరీర్ లో ఫాం కొనసాగించేలా ఈ సాంగ్స్ ఉంటాయని తెలుస్తుంది. మరి శ్రీయ శరణ్ ఈ స్పెషల్ సాంగ్ లో ఎలా దర్శనమిస్తుందో చూడాలి. సూర్య 44 మాత్రమే కాదు మిరాయ్ లో కూడా శ్రీయ అందాలు ఆడియన్స్ కి సూపర్ ట్రీట్ అందించనున్నాయి. Shreya Sharan, Shreya , Shriya Item Song, Teja Sajja, Surya, Surya 44, Mirai