Shruthi Haasan : ఫోకస్‌ మొత్తం దాని మీదే.. శ్రుతీ హాసన్ కామెంట్స్ వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Published on: February 3, 2021, 9:59 pm

Shruthi Haasan : శ్రుతీ హాసన్ ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ సలార్ చిత్రంలో శ్రుతీ హాసన్‌ను తీసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌కు శ్రుతీ హాసన్‌ను ఎంపిక చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ విషయమే కాకుండా శ్రుతీ హాసన్‌ను మరో విషయం వార్తల్లో నిలిచేలా చేసింది. ఆ మధ్య శ్రుతీ హాసన్ తన బ్రేకప్ తరువాత డిప్రెషన్, సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

Shruthi Haasan Joins Salaar Shoot

Shruthi Haasan Joins Salaar Shoot

చాలా రోజుల తరువాత శ్రుతీ హాసన్ కెరీర్ మళ్లీ గాడిలో పడుతోంది. ఈ సమయంలో మరోసారి ఆమె ప్రేమలో పడింది. డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికాతో శ్రుతి ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై శ్రుతీ హాసన్ స్పందిస్తూ సూక్తులు వల్లించింది. తన పని గురించి మాట్లాడండి.. పర్సనల్ విషయాలు అవసరం లేదంటూ గట్టిగా కౌంటర్లు వేసింది. ఆమె ప్రస్తుతం సలార్ షూటింగ్‌లో ఉంది.

Shruthi Haasan : : శ్రుతీ హాసన్ కామెంట్స్

‘ప్రస్తుతం ‘సలార్‌’ షూట్‌లో బిజీగా పాల్గొంటున్నాను. ఇప్పటి వరకూ నేను పోషించిన పాత్రలతో పోలిస్తే.. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ చాలా విభిన్నంగా ఉండనుంది. ‘సలార్‌’ గురించి ఇప్పుడే పెదవి విప్పలేను. మొదటిసారి ప్రభాస్‌తో కలిసి పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉంది. మంచి మనస్సున్న, వృత్తిపట్ల పూర్తి నిబద్ధత కలిగిన వ్యక్తి ఆయన చెప్పుకొచ్చింది. కొత్త ప్రేమ వ్యవహారంపై ప్రశ్నిస్తే.. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం నాకిష్టం లేదు. ప్రస్తుతం నా ఫోకస్‌ మొత్తం పనిమీదనే. కాబట్టి ఎదుటివారు కూడా నా వర్క్‌పైనే ఫోకస్‌ చేస్తే బాగుంటుందని కౌంటర్ వేసింది.

Cinema Desk

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp