
shruthi hassan says about vakeel saab as a hit movie
Shruthi hassan : శృతి హాసన్ ఈ మధ్యే రవితేజ నటించిన క్రాక్ సినిమాతో సాలీడ్ హిట్ అందుకొని మంచి కం బ్యాక్ ఇచ్చింది. మూడేళ్ళ తర్వాత టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ క్రాక్ సక్సస్ తో వరసగా అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ అన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో నటిస్తోంది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ – శృతిహాసన్ సహా ఇతర తారాగణం పాల్గొంటున్న సీన్స్ ని తెరకెక్కిస్తున్నారట.
ఇక ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ కూడా కంప్లీట్ చేసింది శృతి హాసన్. ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో శృతి హాసన్ కనిపించబోతోంది. గెస్ట్ రోల్ అయినా చాలా కీలకం అని తెలుస్తోంది. కాగా వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించిన హ్యాట్రిక్ సినిమా కావడం విశేషం. తెలుగులో గబ్బర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శృతిహాసన్ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. మూడేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ తో కాటమరాయుడు అన్న సినిమా చేసిన శృతిహాసన్ ఆ తర్వాత మళ్ళీ క్రాక్, వకీల్ సాబ్ సినిమాలతోనే ఎంట్రీ ఇచ్చింది.
shruthi hassan says about vakeel saab as a hit movie
ఈ క్రమంలో వకీల్ సాబ్ సినిమా బ్లాక్ బస్టర్ అని ధీమాగా చెబుతోంది శృతి హాసన్. వకీల్ సాబ్ సామాజిక సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని రూపొందిన సినిమా..మహిళల భద్రత హక్కుల గురించి చర్చించే సినిమా ‘వకీల్ సాబ్’ ఉంటుందని చెప్పుకొచ్చింది. అంతేకాదు ప్రజల్ని ప్రభావితం చేయగల పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమాల్లో నటించడం గొప్ప విషయం అని తెలిపింది. ఇక ఈ సినిమా ప్రేక్షకులను, పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెబుతోంది శృతి హాసన్. ఇక ఈ సినిమాకి వేణు శ్రీరాం దర్శకత్వం వహించగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఏప్రిల్ 9న ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.