
this is the main reason for nithin's check failure
Check Movie : చెక్ ..తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. యూత్ స్టార్ నితిన్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. చెక్ ఆట నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో పూర్తిగా చంద్ర శేఖర్ యేలేటి శైలిలో తెరకెక్కిన ఈ సినిమా మీద నితిన్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇక యంగ్ బ్యూటీస్ రకుల్ ప్రీత్ సింగ్, డెబ్యూ హీరోయిన్ గా పరిచయం అయిన ప్రియా ప్రకాష్ వారియర్ చెక్ సక్సస్ మీద ఆశలన్ని పెట్టుకున్నారు.
కాని ఈ సినిమా కి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. గత ఏడాది భీష్మ సినిమాతో భారీ హిట్ అందుకున్న నితిన్ సరిగ్గా ఏడాది గ్యాప్ తర్వాత చెక్ సినిమాతో వచ్చాడు. వాస్తవంగా నితిన్ – కీర్తి సురేష్ నటించిన రంగ్ దే ముందు రిలీజ్ కావాల్సి ఉండగా అనూహ్యంగా చెక్ ముందు రిలీజ్ అయింది. అయితే నితిన్ చేసిన ప్రయోగం బెడిసి కొట్టిందని చెప్పుకుంటున్నారు. కథ, కథనం బాగానే ఉన్నప్పటికి అది నితిన్ కి వర్కౌట్ కాలేదన్న టాక్ వస్తోంది. ఇప్పుడిప్పుడే సక్సస్ లు అందుకుంటూ ట్రాక్ ఎక్కిన నితిన్ చెక్ తో అనవసరంగా ప్రయోగం చేసి రిస్క్ చేశాడని మాట్లాడుకుంటున్నారు.
Check Movie : చెక్ పెట్టలేకపోయిన నితిన్ .. తేడా కొట్టింది అక్కడే..?
ఇక దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి కూడా ఈ సినిమా సక్సస్ మీద ఎంతో ధీమాగా ఉన్నాడు. కాని ఆయనకి చెక్ షాకిచ్చిందంటున్నారు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఈ సినిమాకి పెద్ద మైనస్ అయిందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. చంద్ర శేఖర్ యేలేటి పక్కా స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని కట్టి పడేస్తాడు. అలాంటిది చెక్ లో ఇది పెద్ద లోపంగా కనిపిస్తుందట. కథ అద్భుతంగా ఉన్నప్పటికి తెరమీదకి తీసుకు రావడంలో దర్శకుడు కొన్ని పొరపాట్లు చేశాడని అంటున్నారు. చెక్ తో పాటు పెద్దగా బజ్ లేని పది సినిమాలు రిలీజయ్యాయి. వాటన్నిటితో పాటు ఉప్పెన సినిమాకి చెక్ పెడుతుందని అందరూ భావిస్తే సీన్ రివర్స్ అయిందంటున్నారు.
ఇది కూడా చదవండి ==> Check Movie Review : నితిన్ చెక్ మూవీ రివ్యూ
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.