Shruti Haasan : శృతి హాసన్ ని పెళ్ళెప్పుడు అని అడిగిన నెటిజన్ కి చుక్కలు కనిపించే ఆన్సర్ చెప్పింది ..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :4 March 2023,8:00 pm

Shruti Haasan : తెలుగు ఇండస్ట్రీలో హీరో సిద్ధార్థ్ నటించిన ‘ అనగనగా ఓ ధీరుడు ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శృతి హాసన్. ఇక తన తండ్రి శ్రుతి హాసన్ పేరు చెప్పుకొని ఇండస్ట్రీ లోకి వచ్చిన తను సొంత టాలెంట్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళుతోంది. ఈ ఏడాది ఆరంభంలో వీరసింహారెడ్డి , వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్ కు జోడి ‘ సలార్ ‘ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది.

Shruti Haasan answer to netizens about her marriage

Shruti Haasan answer to netizens about her marriage

మరోవైపు కోలీవుడ్, హాలీవుడ్ సినిమాలలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తన వ్యక్తిగత విషయానికొస్తే గత రెండేళ్ల నుంచి ఈ బ్యూటీ చిత్రకారుడు శంతను హజారికాతో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. అయితే తాజాగా శృతిహాసన్ సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ మీ పెళ్లెప్పుడు అని అడగగా దానికి బదులుగా శృతిహాసన్ ఊహించని ఆన్సర్ ఇచ్చింది. ఇప్పటికే ఈ ప్రశ్న వినీ వినీ చాలాసార్లు బోర్ కొట్టేసింది అన్నట్లుగా సమాధానం ఇచ్చింది. పెళ్లి గురించి కాకుండా ఇంకేమైనా అడగండి అంటూ శృతి తెలిపింది.

Shruti Haasan responds to question about her marriage plans - Tamil News -  IndiaGlitz.com

దీంతో శృతి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని పరోక్షంగా చెప్పింది. ఇక జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదలైన బాలయ్య వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలతో శృతిహాసన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఇక కోలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ తో త్రీ అనే సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటించిది. ఈ సినిమాలో వీళ్ళ రొమాన్స్ చూసి చాలామంది వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి