Manchu Manoj : మంచు మనోజ్ రెండో పెళ్లిలో మోహన్ బాబుని పట్టుకుని బోరున ఏడ్చిన పెళ్లికూతురు..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :4 March 2023,5:00 pm

Manchu Manoj : మంచు మనోజ్ రెండో వివాహం నిన్న రాత్రి 8:30 గంటలకు జరిగిన సంగతి తెలిసిందే. రాయలసీమ పొలిటికల్ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందిన భూమా మౌనికనీ వివాహం చేసుకోవడం జరిగింది. మనోజ్ రెండో పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీళ్ళందరి మధ్య భూమా మౌనికకి మూడు ముళ్ళు వేసి.. కొత్త జీవితంలో మంచు మనోజ్ అడుగు పెట్టడం జరిగింది. అయితే ఈ వివాహ కార్యక్రమంలో..

Manchu Manoj Marriage With Mounika Reddy

Manchu Manoj Marriage With Mounika Reddy

పెళ్లికూతురు భూమా మౌనిక మోహన్ బాబుని పట్టుకుని బోరున ఏడవటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సన్నివేశానికి సంబంధించి ఫోటోలు మరియు వీడియో.. వైరల్ అవుతూ ఉంది. 2015వ సంవత్సరంలో భూమా మౌనికకి బెంగళూరుకీ చెందిన పారిశ్రామికవేత్తతో వివాహం అయింది. ఈ వివాహానికి అప్పట్లో మంచు మనోజ్ అతిథిగా వచ్చారు. ఆ తర్వాత భూమా మౌనికకీ … మొదటి భర్తకి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు ఇవ్వడం జరిగింది. ఇక ఇదే సమయంలో

Manchu Manoj and Bhuma Mounika Reddy Marriage Visuals | Mohan Babu | YS  Vijayamma | Manastars - YouTube

మంచు మనోజ్ తన మొదటి భార్య ప్రణతి రెడ్డికి తనకి మధ్య మనస్పర్ధలు రావడంతో … ఇద్దరూ వేరైపోయారు. ఇటువంటి పరిస్థితులలో గత కొద్ది నెలల నుండి భూమా మౌనికతో.. మనోజ్ సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఇద్దరూ కూడా చాలా సందర్భాలలో మీడియా ముందు కూడా కనిపించడం జరిగింది. ఈ క్రమంలో మార్చి మూడో తారీకు కుటుంబం మరియు సన్నిహితుల మధ్య.. ఒకటవటం సంచలనం సృష్టించింది. హైదరాబాద్ ఫిలింనగర్ లో నిన్న జరిగిన మంచు మనోజ్ భూమా మౌనిక పెళ్లికి భారీ ఎత్తున.. సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

sekhar

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి