Shruti Haasan : ఇటీవలి కాలంలో ఇండస్ట్రీలో లవ్, బ్రేకప్స్ అనేవి కామన్‌గా వింటున్నాం.చిన్న చిన్న విషయాలకి బ్రేకప్ చెప్పుకుంటున్నారు.. షూటింగ్ టైంలోనో లేదంటే ఇతర ఈవెంట్స్‌లో పరిచయం ఏర్పడటం.. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారటం.. ఆ స్నేహం కాస్త ప్రేమ వరకు తీసుకెళ్లటం. అలా కొన్నాళ్లు ప్రేమ పేరుతో డేటింగ్ చేసి చివరకు మ్యారేజ్ సమయానికి విడిపోతున్నారు. ఈ లిస్ట్‌లో ఇప్పుడు శృతి హాసన్ చేరింది. ఈ అమ్మడి లైఫ్ లో బ్రేకప్ లిస్ట్ మూడుకి చేరింది. 3 అనే సినిమా చేసే సమయంలో ధనుష్ తో ఎఫైర్ ఉందని.. ధనుష్ భార్య ఫైర్ కావడంతో వీరికి బ్రేకప్ అయ్యిందని వార్తలు వచ్చాయి. ఇక ఆ తరువాత శృతి మైఖేల్ అనే వ్యక్తితో సీరియస్ రిలేషన్ లో ఉండేది.
అతడిని పెళ్లి చేసుకుంటుందని అందరు అనుకున్నారు. కాని కొన్నాళ్ళకు అతనికి బ్రేక్ అవ్వడంతో అమ్మడు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళింది. మందుకు, డ్రగ్స్ కు బానిసగా మారి సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చింది. ఇక మెల్లిగా ఆ బ్రేకప్ బాధ నుంచి బయటపడి శాంతను హజారికతో మరోసారి ప్రేమలో పడింది. కొన్నేళ్లుగా వీరిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఈ ఇద్దరు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. శాంతనుతో దిగిన ఫోటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. కొన్నాళ్లుగా శృతి హాసన్ సైలెంట్ అవ్వడంతో జనాలకు డౌట్ వచ్చింది.
ఆరా తీయగా… శాంతనుతో ఆవిడ బ్రేకప్ న్యూస్ నెల క్రితం బయటకు వచ్చింది. ఇప్పుడు అది నిజమని ఆవిడ చెప్పింది. ఇప్పుడు శృతి హాసన్ ముంబైలో ఉన్నారు. ఓ హిందీ సినిమా షూటింగ్ చేస్తున్నారు. స్టూడియోకి వెళ్లేటప్పుడు ఆవిడ ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కండక్ట్ చేశారు. ఇందులో ‘సింగిల్ ఆర్ కమిటెడ్’ అని ఓ నెటిజన్ అడిగాడు. అప్పుడు శృతి హాసన్ ”నాకు ఈ తరహా ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టం ఉండదు. కానీ, ఇప్పుడు నేను సింగిల్. మింగిల్ అవ్వటానికి రెడీగా ఉన్నాను. ఓన్లీ వర్కింగ్, ఎంజాయింగ్ మై లైఫ్. బై! చాలా” అని వీడియోలో పేర్కొన్నారు. దాంతో అందరికీ క్లారిటీ వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.