Shruti Haasan : ఆ పోస్ట్‌తో త‌న బాయ్ ఫ్రెండ్‌కి బ్రేక‌ప్ చెప్పిన‌ట్టు క‌న్‌ఫాం చేసిన శృతి హాస‌న్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shruti Haasan : ఆ పోస్ట్‌తో త‌న బాయ్ ఫ్రెండ్‌కి బ్రేక‌ప్ చెప్పిన‌ట్టు క‌న్‌ఫాం చేసిన శృతి హాస‌న్

 Authored By ramu | The Telugu News | Updated on :24 May 2024,4:00 pm

Shruti Haasan : ఇటీవ‌లి కాలంలో ఇండ‌స్ట్రీలో ల‌వ్, బ్రేక‌ప్స్ అనేవి కామ‌న్‌గా వింటున్నాం.చిన్న చిన్న విష‌యాల‌కి బ్రేక‌ప్ చెప్పుకుంటున్నారు.. షూటింగ్ టైంలోనో లేదంటే ఇత‌ర ఈవెంట్స్‌లో పరిచయం ఏర్పడటం.. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారటం.. ఆ స్నేహం కాస్త ప్రేమ వరకు తీసుకెళ్లటం. అలా కొన్నాళ్లు ప్రేమ పేరుతో డేటింగ్ చేసి చివరకు మ్యారేజ్ స‌మ‌యానికి విడిపోతున్నారు. ఈ లిస్ట్‌లో ఇప్పుడు శృతి హాస‌న్ చేరింది. ఈ అమ్మడి లైఫ్ లో బ్రేక‌ప్ లిస్ట్ మూడుకి చేరింది. 3 అనే సినిమా చేసే సమయంలో ధనుష్ తో ఎఫైర్ ఉందని.. ధనుష్ భార్య ఫైర్ కావడంతో వీరికి బ్రేకప్ అయ్యిందని వార్తలు వచ్చాయి. ఇక ఆ తరువాత శృతి మైఖేల్ అనే వ్యక్తితో సీరియస్ రిలేషన్ లో ఉండేది.

Shruti Haasan : మూడో బ్రేక‌ప్..

అత‌డిని పెళ్లి చేసుకుంటుంద‌ని అంద‌రు అనుకున్నారు. కాని కొన్నాళ్ళకు అత‌నికి బ్రేక్ అవ్వడంతో అమ్మడు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళింది. మందుకు, డ్రగ్స్ కు బానిసగా మారి సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చింది. ఇక మెల్లిగా ఆ బ్రేకప్ బాధ నుంచి బయటపడి శాంతను హజారికతో మరోసారి ప్రేమలో పడింది. కొన్నేళ్లుగా వీరిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు. సోష‌ల్ మీడియాలో ఈ ఇద్ద‌రు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. శాంతనుతో దిగిన ఫోటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. కొన్నాళ్లుగా శృతి హాసన్ సైలెంట్ అవ్వడంతో జనాలకు డౌట్ వచ్చింది.

Shruti Haasan

ఆరా తీయగా… శాంతనుతో ఆవిడ బ్రేకప్ న్యూస్ నెల క్రితం బయటకు వచ్చింది. ఇప్పుడు అది నిజమని ఆవిడ చెప్పింది. ఇప్పుడు శృతి హాసన్ ముంబైలో ఉన్నారు. ఓ హిందీ సినిమా షూటింగ్ చేస్తున్నారు. స్టూడియోకి వెళ్లేటప్పుడు ఆవిడ ట్రాఫిక్‌లో చిక్కుకోవ‌డంతో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కండక్ట్ చేశారు. ఇందులో ‘సింగిల్ ఆర్ కమిటెడ్’ అని ఓ నెటిజన్ అడిగాడు. అప్పుడు శృతి హాసన్ ”నాకు ఈ తరహా ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టం ఉండదు. కానీ, ఇప్పుడు నేను సింగిల్. మింగిల్ అవ్వటానికి రెడీగా ఉన్నాను. ఓన్లీ వర్కింగ్, ఎంజాయింగ్ మై లైఫ్. బై! చాలా” అని వీడియోలో పేర్కొన్నారు. దాంతో అందరికీ క్లారిటీ వచ్చింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది